మొండిగౌరెల్లిలో రెండో రోజు నిరాహార దీక్ష
మొండిగౌరెల్లి, జూలై 21:
పారిశ్రామిక పార్కు కోసం నిర్వహించిన భూ సర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, నూతన మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. సర్వేలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని సమితి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు.





