ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బీపేట లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జాతీయ తెలుగు సాహిత్య సదస్సు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ జానపద అకాడమీ తొలి అధ్యక్షులు, కళారత్న పొట్లూరి హరికృష్ణ తెలిపారు. కృత్రిమ మేధస్సు అంటే కేవలం యంత్రాల విజ్ఞానం కాదని, అది మానవ మేధో శక్తి అపరిమిత ఊహలకు ఒక సాంకేతిక ప్రతిబింబమన్నారు. నాడు గంటంతో కావ్యం వ్రాసినా, మరునాడు కీబోర్డుతో అద్భుతాలు ఆవిష్కరించినా, నేడు కృత్రిమ మేధతోడై మానవ మేధో సంపత్తికి సరికొత్త దిశా నిర్దేశం చేస్తోందని . ఈ సాంకేతిక ప్రవాహంలో భాష , సాహిత్య , జానపద కళారూపాల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న జాతీయ తెలుగు సాహిత్య సదస్సుకు సభాధ్యక్షురాలుగా కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ వి. వింధ్యవాసినీ దేవి, సభాధ్యక్షులుగా రాజమహేంద్రవరములోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడు , విశిష్ట అతిధులుగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ ,ఆత్మీయ అతిధులుగా బెనారస్ హిందూ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు . డాక్టర్ భమిడిపాటి విశ్వనాథ, విజయవాడ అర్చక ట్రైనింగ్అకాడమీ పూర్వసంచాలకులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, వరంగల్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పీఠాధిపతి గడ్డం వెంకన్న లు వ్యవహరిస్తున్నారని పొట్లూరి హరికృష్ణ తెలిపారు.నేటి జాతీయ తెలుగుసాహిత్య సదస్సుకు డాక్టర్ కె వి ఎన్ డి వరప్రసాద్ , శ్రీవ్రత వాక్జరీ, ప్రవచన గార్గి డాక్టర్ అయినవోలు మంజుల , ఇందూ జగన్నాథ్ సభా సమన్వయకర్తలుగా వ్యవహారిస్తారని పొట్లూరి హరికృష్ణ తెలిపారు.

నేడు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్దార్ధ మహిళా కళాశాలలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు