ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్.పి. డా. అజిత వెజెండ్ల, ఐపీస్ పారదర్శకంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన కానిస్టేబుల్ నుండి ఏఎస్సై స్థాయి వరకు మొత్తం 212 మంది సిబ్బందికి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బదిలీలు చేపట్టారు. సీనియారిటీ, సేవా కాలం, పనితీరు ఆధారంగా నిష్పక్షపాతంగా పోస్టింగులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో సిబ్బంది అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పారదర్శక విధానం వల్ల సిబ్బందిలో నమ్మకం పెరిగిందని, శాఖలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో పారదర్శక బదిలీలు – 212 మంది సిబ్బందికి మార్పులు