Thursday, 9 July 2026
  • Home  
  • దేశ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు… డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఘనంగా….!
- అనకాపల్లి

దేశ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు… డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఘనంగా….!

అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భారతీయ జనతా పార్టీ ఎలమంచిలి మండలం రూరల్ ఆధ్వర్యంలో ఏటికొప్పాక గ్రామంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు, జాతీయ సమైక్యతకు అంకితభావంతో సేవలందించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధానులు ఉండరాదు” అనే నినాదంతో దేశ సమగ్రత కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. భారతదేశ అఖండత, జాతీయత పరిరక్షణలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, యువత ఆయన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు, కిసాన్ మోర్చా కార్యదర్శులు ఉగ్గిన్ బాబ్జి, కడారి దుర్గారావు, చుక్కల శ్రీను, లంక ఈశ్వరరావు, లావేటి సురేష్, నాగిరెడ్డి శివతో పాటు పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

భారతీయ జనతా పార్టీ ఎలమంచిలి మండలం రూరల్ ఆధ్వర్యంలో ఏటికొప్పాక గ్రామంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు, జాతీయ సమైక్యతకు అంకితభావంతో సేవలందించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎలమంచిలి మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధానులు ఉండరాదు” అనే నినాదంతో దేశ సమగ్రత కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. భారతదేశ అఖండత, జాతీయత పరిరక్షణలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, యువత ఆయన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు, కిసాన్ మోర్చా కార్యదర్శులు ఉగ్గిన్ బాబ్జి, కడారి దుర్గారావు, చుక్కల శ్రీను, లంక ఈశ్వరరావు, లావేటి సురేష్, నాగిరెడ్డి శివతో పాటు పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.