Monday, 21 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి రూపాయలతో ఆస్పత్రికి కొత్త హంగులు

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి దాతలు డీఎస్ఆర్ రఘురాం రెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి సొంత నిధులు రూ.కోటి అందించారు. ఈ నిధులతో రెండు ఏసీ రెస్ట్‌హౌస్‌లు, ఆర్వో వాటర్ ప్లాంట్, టాయిలెట్ల రెన్యువేషన్ పనులకు పీహెచ్‌డీ స్కాలర్ మల్లెల శ్రీహరి చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శంకుస్థాపన చేయించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వికసిత భారత్‌కు యువతే బలం

నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్–2047’ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.బి. రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజయభారతి విద్యార్థులకు మానవ హక్కులు, రాజ్యాంగ బాధ్యతలపై అవగాహన కల్పించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని, కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణవేణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దోర్నాధుల వెంకటేశ్వర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారి పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ, జర్నలిస్టులకు పెన్షన్ అమలు అవసరమని తెలిపారు. గిరిజనులు, దళితులు, బీసీల సమస్యలపై మీడియా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఖైదీలకు న్యాయ అవగాహన

హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకుటూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ ఖైదీల యోగక్షేమాలు, భోజనం, వైద్య సదుపాయాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాది లేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అనంతరం రిజిస్టర్లు, గ్రీవెన్స్ బాక్స్ పరిశీలించి, మహిళా ఖైదీల సమస్యలను తెలుసుకున్నారు. కొందరు ఖైదీలకు కంటి అద్దాలు పంపిణీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి| వై.ఓ. నందన్

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక హోటల్ ట్రేడ్ లైసెన్స్‌ను తనిఖీ చేసి, నగరంలో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. అనంతరం డ్రైన్లలో మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించి, స్థానికులను పారిశుధ్య నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల పాత్ర కీలకం:ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారి పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ, జర్నలిస్టులకు పెన్షన్ అమలు అవసరమని తెలిపారు. గిరిజనులు, దళితులు, బీసీల సమస్యలపై మీడియా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వీధి శునకాలపై ప్రత్యేక డ్రైవ్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధి శునకాల నియంత్రణకు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు వావిలేటిపాడు, పొదలకూరు రోడ్డు, రామకోటయ్య నగర్, బోసు బొమ్మ ప్రాంతాల్లో సంచరిస్తున్న 12 శునకాలను పట్టుకుని పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

100% చెత్త సేకరణకు వై.ఓ నందన్ ఆదేశం

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శానిటేషన్ విభాగంతో వారాంతపు సమీక్ష నిర్వహించారు. అన్ని డివిజన్లలో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని బ్లాక్‌స్పాట్లను తొలగించి గ్రీన్‌స్పాట్లుగా మార్చాలని, వ్యాపార సంస్థలను గుర్తించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేసి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్‌ను జప్తు చేసి జరిమానాలు విధించాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, జంక్షన్ల వద్ద చెత్త నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది మస్టర్ సమయానికి హాజరై విధులు నిర్వర్తించేలా అధికారులు పర్యవేక్షించాలని నందన్ అన్నారు. సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, వెటర్నరీ వైద్యుడు మదన్ మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టెంకాయ వ్యర్థాలపై చర్యలు : వై.ఓ. నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం మినీ బైపాస్ రోడ్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్డు వెంబడి టెంకాయలు విక్రయించే వ్యాపారులు వ్యర్థాలను ప్రత్యేక బుట్టల్లో సేకరించి చెత్త వాహనాలకు లేదా డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. రోడ్డు పక్కన వ్యర్థాలు వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే రహదారిని ఆక్రమించకుండా నిర్దేశిత మార్జిన్‌లోనే వ్యాపారం నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామతీర్థం బీచ్‌కు వసతులెప్పుడు?

రామతీర్థం బీచ్‌కు పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, స్నానపు గదులు, ఆహార సదుపాయాలు అందుబాటులో లేవు. భద్రతా చర్యలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, పండగలు, సెలవు రోజుల్లో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు బీచ్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తే పర్యాటకం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.