Monday, 21 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

10వ డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకున్న అడిషనల్ కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల రహిత నెల్లూరే లక్ష్యం: నారాయణ

నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువనేత నారా లోకేష్‌కు ఘనస్వాగతం

మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు రూరల్‌లో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో రూరల్ ప్రాంతం జనసంద్రంగా మారేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకునే స్థాయిలో స్వాగత కార్యక్రమం నిర్వహించాలని కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నారా లోకేష్‌కు భారీ స్వాగతం పలకనున్నట్లు నేతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎస్ డెవలపర్స్‌లో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్

సీఎస్ డెవలపర్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. సమావేశంలో POSP మోడల్, వాహన బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, వాటి ద్వారా టీమ్ సభ్యులకు లభించే వ్యాపార అవకాశాలపై చర్చించారు. బ్రాంచ్ మేనేజర్ గంపాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొద్దు మహేష్, ఎంట్రపాటి వెంకయ్య, వినలరావు రామమోహన్‌రావు, కామటం జోజి, అరవ రవికిరణ్, వాసవి, జాహ్నవి, కాకుమాని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్, క్రాస్ సెల్లింగ్ టీమ్ లీడర్లతో వ్యాపార విస్తరణ, కస్టమర్లకు సమగ్ర సేవలందించే విధానంపై చర్చించారు. కార్యక్రమానికి సహకరించిన సీఎస్ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండ్ల చంద్రశేఖర్‌కు పున్నమి తరఫున ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం

శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి. నెల్లూరు (పున్నమి ప్రతినిధి ) ఉట్టి మహోత్సవం శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం నెల్లూరు ఉమ్మారెడ్డిగుంట కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 28వ ఉట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం 17వ తేదీన కూడా భక్తులు, స్థానిక ప్రజల కోసం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉట్టి మహోత్సవాన్ని నిర్వహిస్తూ, భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

సాహితీ

డబ్బుకంటే విలువైన ఆ స్పర్శ : కుటుంబ కధ : జిబికే మూర్తి

” ఎదో, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే, సరదాగా రాసానే కానీ, పరీక్ష రాయాలని రాయలేదు. మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని వదిలి, దూరంగా రెండేళ్లు, ఆమ్మో నా వళ్ళ కాదు, వెళ్ళను, మీ దగ్గరే వుంటాను ” – అమెరికా ms గేట్ పరీక్షలో ర్యాంక్ లో పాస్ అయిన పాతికేళ్ళ కొడుకు, కుమార్ అమ్మ, నాన్న తో అన్నాడు. ” నిన్ను వదిలి మేము మాత్రం ఉండగలమా! కానీ బంధం బాధ్యతకు అడ్డురాకూడదు, వీడేమో కాల్ ఉందిగా ” 70 ఏళ్ల తండ్రి సాంబయ్య ” అమెరికా లో సీట్ రావటమే గొప్ప! మా కొడుకు అమెరికా అని పది మంది ముందు చెప్పుకోవాలిగా!, నువ్వు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే, నా మీద ఒట్టే! 65 ఏళ్ల తల్లి దుర్గ. కొడుకును ఒప్పించి, ఇల్లు, నగలు, బ్యాంకు లో కుదువ పెట్టి డబ్బు తెచ్చి, అమెరికా పంపారు. ఇష్టం లేక పోయిన, కాదనలేక వెళ్ళాడు. కొద్దిరోజులు డైలీ వీడేమో కాల్ చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి, నెలకోసారి చేసేవాడు. దుర్గ ఆరోగ్యం చెడింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయాలి అన్నారు డాక్టర్లు. రిటైర్డ్ టీచర్ పాతిక వేల పెన్షన్ లో అప్పు కటింగ్స్ పొగ, వచ్చే పది వేల రూపాయల డబ్బు తో ఇల్లు గడవటమే కష్టం గా వున్న సాంబయ్య కు డయాలిసిస్ ఖర్చు భారమైపోయింది. బావమరిది నంది తో ” ఆరోగ్యశ్రీ కార్డు లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, అమెరికా కొడుకు తండ్రిగా ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించను నామోషీ, ఇరుగు పోరుగు ఏమనుకుంటారేమో! కార్పొరేట్ వైద్యం చేయించే స్థోమత లేదు ” ఎం చేయాలి బాధపడుతూ, ఎలాగూ తీర్చే అప్పుకాదు, వడ్డీ పెరగటం తప్ప, ఇల్లు అమ్మేసి, బ్యాంకు బాకీ తీర్చేసి మిగిలిన డబ్బు తో వైద్యం చేయిస్తాను అంటాడు. అది విన్న దుర్గ ఇల్లు అమ్మితే, ఉండను నీడ ఉండదు, నగలు అమ్మేసి, బాకీ తీర్చేసి, మిగిలిన దాంట్లో వైద్యం చేయించండి, ఈలోగా నా కొడుకు వస్తాడు, వైద్యం చేయిస్తాడు అంటుంది. కొడుక్కు ఫోన్ చేయచ్చుకదా అంటే వాడు వెళ్ళింది చదువుకోను, ఉద్యోగం చేయను కాదు, వద్దు అంటాడు సాంబయ్య. నగలు అమ్మిన డబ్బు తో అరునెలలు డయాలిసిస్ చేయిస్తారు. చదువు అయిపోయిన ఫోన్ లేదు కొడుకు దగ్గర నుంచి. భార్య మంగళసూత్రం అమ్మి వైద్యం చేయించాలని నిర్ణయించి, పసుపు తాడు కట్టెందుకు సిద్ధమవుతుండగా కొడుకు దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది తాను వస్తున్నట్టు. కొడుకు వచ్చాడు. అమ్మ, నాన్న ను చూసి ఏంటి ఇలా చిక్కిపోయారు అంటాడు. ఆరిపోయేందుకు సిద్ధంగా వున్న దీపాలం మేము అంటుంది తల్లి. మీ దీపాలు ఆరిపోకుండ నేను చమురు అవుతాను అంటాడు. అయితే అమెరికా మళ్ళీ వెళ్ళవా! అంటుంది తల్లి. ఎందుకు, నేను వెళ్ళింది చదువుకోను, నా చదువు నా దేశానికి,నా శరీరం మీకు సేవ చేసేందుకు ఉపయోగపడాలి, అంటాడు. ఇక్కడ నీకు వచ్చే డబ్బుతో ఇల్లు గడవాలి, మీ అమ్మకు వైద్యం, చేయించాలి, ఇక అప్పు తీరేది ఎప్పుడు, తప్పు నీది కాదు,అప్పు చేసి నిన్ను చదివించిన మీ అమ్మ, నాన్నది తప్పు అంటాడు మేనమామ నంది. మా తప్పు కూడ వుంది మామయ్య! అమెరికా లో చదుకువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఆ డబ్బు తో ఫుడ్, షెల్టర్ తో పాటు, అప్పు తీర్చేందుకు ఇంటికి డబ్బు పంపించాలి అన్న మైండ్ సెట్ తప్పు, ఎందుకంటే స్టూడెంట్ వీసా చదువుకోను మాత్రమే ఇస్తారు. కాంపెస్ బయట ఉద్యోగం చేయటం నేరం, అలాంటి పరిస్థితిలో వెళ్ళక పోవటమే మంచిది. నేను కూడ చాలా స్ట్రగల్ అయ్యాను. మా ఫ్రెండ్ హెల్ప్ చేసాడు. ఇద్దరం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లో రోబోటిక్ సహాయం తో వైద్య రంగం, రక్షణ రంగం, డ్రోన్ ద్వారా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనుక్కున్నాం. దాన్ని అమ్మితే డబ్బు తో పాటు ఉద్యోగం ఇస్తామని ఫారిన్ కంపెనీలు ముందుకొచ్చాయి, వాటిని కాదని, మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక్కడే కంపెనీ స్టార్టప్ లో స్టార్ట్ చేసాం. నేను మేనేజంగ్ డైరెక్టర్. రిచ్ గా కాకపోయినా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. లేదు, నాకు అమెరికా కొడుకు స్టేటస్ కావాలి అంటే, నీకు నగలు కొనిస్త, బాకీ తీర్చేసి ఇల్లు విడిపిస్తా, కార్పొరేట్ వైద్యం చేయిస్తా, కాకపోతే నేను నీకు దగ్గరగా ఉండలేను, ఈ ఫిసికల్ టచ్ ఉండదు, చెప్పు నీకు నేను కావాలా! నా డబ్బు కావాలా!అంటాడు డబ్బు ఉంటే దేవుడే మన హ్యాండ్ బాగు లో ఉన్నట్టు, మనిషి దగ్గర లేకపోతే ఎం ఆన్లైన్ లో మీకు కావలిసిన వన్ని ఇంటి గుమ్మం వద్దకే వస్తాయి, అక్కయ్య కు చెప్పు బావ అంటాడు. చెప్పటానికి వాడు అడ్డాలనాటి బిడ్డ కాదయ్య! చిన్నప్పుడు బడి కి వెళ్లనని, మోరాయించిన వీడు, ఒక్కో మెట్టు ఎక్కి పై మెట్టుకి చేరాడు. అక్కడ నించి చూస్తే ప్రపంచం వీడి కింద ఉన్నట్టు కనపడుతుంది, ఒక్క చదువు లోనే కాదు, విలువల్లో కూడ పైన వున్నాడు. అలాంటి వాడు దేశం. కోసం మా కోసం డాలర్లని, స్టేటస్, ని గడ్డి పరకల కాదని వచ్చి, నా చేయి పట్టుకోండి అంటున్నాడు. నువ్వేమో వాడి చేయి కాదు, వాడి చేతిలో వుండే డబ్బు అందుకోండి అంటున్నావు. డబ్బు కోసం కాకపోయినా, వాడి చేయి పట్టుకుంటే ఇక్కడే ఆగిపోతాడు. చేయి వదిలేస్తే, ఒక ఓరి దత్తాత్రేయ లాగో, సుందర్ పిచాయి లాగో ప్రపంచానికి చెంది సేవ చేస్తాడు, దేశం ప్రతిష్ట పెంచుతాడు ఎం కావాలి అని భార్యని అడిగాడు. వాడు వెళ్ళటమే మంచిది, వెళితే, కొడుకు చంపలు నిమురుతూ, ముద్దు పెట్టుకుని, చేయి గట్టిగ పట్టుకుని, ఈ టచ్ మిస్ అవుతాను అంది బాధగా ఈ టచ్ వెలకట్టలేని సంపద, ఇది అమూల్యం ఇది నాకు కావాలి, దీన్ని దూరం చేసేది ఏమి నాకు వద్దు అని పెద్దగా ఏడుస్తూ అమ్మ నాన్న కాళ్ళ మీద పడ్డాడు.కొడుకు కుమార్. దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచారు అమ్మ, నాన్న. మనవాడు జీవితం అనే పరీక్ష లో కూడ నెగ్గాడు డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, బంధం పోతే ఎంత ఏడ్చినా రాదు, వున్నప్పుడే కాపాడుకోవాలి అది అమూల్యం అన్నాడు నంది. సమాప్తం రచన : జిబికే మూర్తి 9948093608

సక్సెస్ స్టోరీస్

కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందన

ప్రజల అవగాహన కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజా సానుకూల అభిప్రాయంలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం 1. ప్రజా సానుకూల అభిప్రాయంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ఏ స్థానం సాధించింది? సమాధానం: నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. 2. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌లో నెల్లూరు జిల్లా సాధించిన స్కోర్ ఎంత? సమాధానం: నెల్లూరు జిల్లా 76.6 శాతం స్కోర్ సాధించింది. 3. ప్రస్తుతం ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎవరు? సమాధానం: హిమాన్షు శుక్లా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4. నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఎవరు ప్రత్యేకంగా అభినందించారు? సమాధానం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 5. నెల్లూరు జిల్లా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పనితీరుపై సమీక్ష ఎక్కడ, ఏ సమావేశంలో జరిగింది? సమాధానం: అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశంలో సమీక్ష జరిగింది. 6. ఎస్‌ఏఏపీ కార్యక్రమంలో ప్రజల సానుకూల అభిప్రాయం ఎంత నుంచి ఎంతకు పెరిగింది? సమాధానం: 67.5 శాతం నుంచి 84.2 శాతానికి గణనీయంగా పెరిగింది. 7. పాఠశాల విద్యపై ప్రజల సానుకూల అభిప్రాయం ఎంతకు పెరిగింది? సమాధానం: 84.4 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది. 8. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్య సేవలపై ప్రజల సానుకూల అభిప్రాయంలో ఎంత మెరుగుదల నమోదైంది? సమాధానం: 76.2 శాతం నుంచి 81.2 శాతానికి పెరిగింది. 9. సమీక్షలో అత్యధిక సానుకూల అభిప్రాయం నమోదైన సేవ ఏది? సమాధానం: కాలుష్య నియంత్రణ మండలి సేవలకు 95.8 శాతం సానుకూల అభిప్రాయం నమోదైంది. 10. నెల్లూరు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం సాధించడానికి ప్రధాన కారణాలు ఏమిటి? సమాధానం: జిల్లా కలెక్టర్ నాయకత్వం, వివిధ శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, ప్రభుత్వ సేవలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యల సత్వర పరిష్కారం, ప్రజల సహకారం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందన*

— ప్రజా సానుకూల అభిప్రాయంలో నెల్లూరు అగ్రస్థానం –76.6 శాతం స్కోర్‌తో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా చేరవేయడంలో ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రజల సానుకూల అభిప్రాయం — *పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్* —లో **76.6 శాతం స్కోర్‌తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో** నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశంలో జిల్లాల పనితీరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సానుకూల అభిప్రాయాలను సమీక్షించారు. ఈ సమీక్షలో నెల్లూరు జిల్లా అగ్రస్థానం సాధించడంపై **జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.** జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రత్యేకంగా **ఎస్‌ఏఏపీ కార్యక్రమంలో పాజిటివ్ పర్సెప్షన్ 67.5 శాతం నుంచి 84.2 శాతానికి**, ఎఫ్‌లైన్ సర్వేలో **70.6 నుంచి 81.4 శాతానికి**, ఆర్‌ఓఆర్ మ్యుటేషన్లలో **68.5 నుంచి 78.5 శాతానికి** పెరగడం విశేషం. ప్రజల నిత్యజీవితానికి నేరుగా సంబంధం ఉన్న వైద్యం, విద్య, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇసుక సరఫరా, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ తదితర సేవల్లోనూ సానుకూల అభిప్రాయం గణనీయంగా మెరుగుపడింది. పాఠశాల విద్యపై ప్రజల సానుకూల అభిప్రాయం **84.4 నుంచి 86.2 శాతానికి**, 3–6 ఏళ్ల చిన్నారులకు అందుతున్న సేవలపై **78.7 నుంచి 80.7 శాతానికి**, గర్భిణీలు, బాలింతల సేవలపై **83.3 నుంచి 84.5 శాతానికి** పెరిగింది. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్య సేవలు కూడా **76.2 నుంచి 81.2 శాతానికి** మెరుగయ్యాయి. కాలుష్య నియంత్రణ మండలి సేవలకు **95.8 శాతం**, ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు **90.9 శాతం**, పట్టణ అన్న క్యాంటీన్లకు **85.9 శాతం**, రీ-సర్వేకు **85 శాతం**, రేషన్ పంపిణీకి **84.5 శాతం**, ఇసుక సేకరణకు **83.4 శాతం** సానుకూల అభిప్రాయం నమోదైంది. ఈ ఫలితం జిల్లా కలెక్టర్ నాయకత్వంతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, ప్రజల సహకారానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రజల సంతృప్తినే పరిపాలన పనితీరుకు ప్రధాన కొలమానంగా తీసుకుని, సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నెల్లూరు జిల్లాను అభివృద్ధి, ప్రజాసేవల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. **ప్రజా సేవల్లో మెరుగైన ఫలితాలు — ప్రజల విశ్వాసంలో అగ్రస్థానం; నెల్లూరు జిల్లా సాధించిన ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి మరింత బాధ్యతను పెంచే విజయంగా నిలిచింది.**

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టి.ఎన్.యు.ఎస్ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నెల్లూరు నగరంలో ఆదివారం జరిగిన టి.ఎన్.యు.ఎస్ కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెవుల రామచంద్ర యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గంగవరపు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథి కేపీ చౌదరి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా వి.పద్మయ్య, కోశాధికారిగా సీహెచ్ నాగరాజు సహా పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని నాయకులు అభినందించి సన్మానించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోషకాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం:ఏ.ప్రమీలమ్మ

పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ కొండాయపాలెం సెక్టార్ సూపర్‌వైజర్ ఏ. ప్రమీలమ్మ సూచించారు. గిలకబావి సంఘం అంగన్వాడీ కేంద్రంలో శనివారం 9వ రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. పోషక పదార్థాల ప్రదర్శన ద్వారా వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ సుజన, హెల్పర్ కమల, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.