Monday, 21 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయసాయి పార్టీ… హిట్టా? ఫట్టా?

బలం ఉంది… బలగం ఉందా? కొత్త రాజకీయ ప్రయోగంపై మొదలైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి రాబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, ఒక దశలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత అత్యంత ప్రభావశీల నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తున్నారు. 2025 జనవరిలో వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి… సుమారు ఏడాదిన్నర తర్వాత మళ్లీ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 7న విజయవాడ వేదికగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త పార్టీకి స్పేస్ ఉందా? టీడీపీ, వైసీపీ ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కూడా తమదైన ఓటుబ్యాంకుతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రతిపాదిస్తున్న కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందన్నదే అసలు ప్రశ్న. ఆర్థిక వనరులు, పరిపాలనా అనుభవం, ఢిల్లీ స్థాయి రాజకీయ పరిచయాలు విజయసాయిరెడ్డికి బలాలు. కానీ ఒక రాజకీయ పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించడానికి ఇవి మాత్రమే సరిపోవు. నాయకుడికి బలం ఉంటే చాలదు… బలగం కూడా కావాలి. ప్రతి నియోజకవర్గంలో నాయకత్వం, మండల–గ్రామ స్థాయి క్యాడర్, కార్యకర్తల నెట్‌వర్క్, ప్రజల్లో ఆకర్షణ, నిరంతరం పార్టీ కోసం పనిచేసే యంత్రాంగం అవసరం. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదే. వలసలు వస్తాయా? కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే ఇతర పార్టీల నుంచి ప్రముఖ నేతలు క్యూ కడతారా? లేక వేచి చూసే ధోరణి అవలంబిస్తారా? అన్నది కూడా కీలకం. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో రాజకీయ అవకాశాలు ఆశిస్తున్న నేతలు ఒకవైపు, వైసీపీతో కొనసాగుతున్న వారు మరోవైపు ఉన్న పరిస్థితుల్లో కొత్త పార్టీ వైపు పెద్దఎత్తున వలసలు రావాలంటే విజయసాయిరెడ్డి బలమైన రాజకీయ అజెండాను ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. కేవలం పార్టీలపై విమర్శలు కాకుండా “మేమెందుకు అవసరం?” అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ఇమేజ్‌ను ఓట్లుగా మార్చగలరా? విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని నాయకుడే. కానీ రాజకీయ పరిచయం వేరు… వ్యక్తిగత ఓటుబ్యాంకు వేరు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన రాజకీయ ప్రాధాన్యం ఎంతవరకు వ్యక్తిగత ప్రజాబలంగా మారింది? ఆయన పేరు మీద ఎంతమంది ఓటర్లు కదులుతారు? పార్టీ కోసం ఎంతమంది నాయకులు, కార్యకర్తలు నిలబడతారు? ఇవే కొత్త పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్నలు. హిట్టా… ఫట్టా? ఇప్పుడే తీర్పు తొందరే కొత్త పార్టీ ప్రకటించకముందే “హిట్” లేదా “ఫట్” అని తేల్చేయడం రాజకీయంగా తొందరపాటు అవుతుంది. అయితే విజయసాయిరెడ్డి ముందు సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ఆర్థిక బలం ఉంది… రాజకీయ అనుభవం ఉంది… పరిచయాలు ఉన్నాయి… కానీ క్షేత్రస్థాయి బలగం ఉందా? ప్రజలను ఆకర్షించే కొత్త అజెండా ఉందా? బలమైన నాయకులను తనవైపు తిప్పుకోగలరా? ఈ ప్రశ్నలకు సెప్టెంబర్ 7న విజయసాయిరెడ్డి ఇచ్చే సమాధానమే ఆయన కొత్త రాజకీయ ప్రయాణానికి తొలి పరీక్ష. పార్టీ పెట్టడం ఒక రోజు పని… దాన్ని ప్రజల పార్టీగా మార్చడం మాత్రం అసలు రాజకీయ పరీక్ష. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే ప్రశ్న— “విజయసాయి కొత్త పార్టీ… హిట్టా? ఫట్టా?”

అక్టోబర్ 1 నుంచి అండర్‌పాస్ పనులు

నెల్లూరు చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంపై పోరాట కమిటీ సభ్యులు హైవే అథారిటీ పీడీని కలిశారు. ఏళ్లుగా ప్రజలు కోరుతున్న అండర్‌పాస్ పనులు అక్టోబర్ 1న ప్రారంభం కానున్నట్లు కమిటీ తెలిపింది. కార్యక్రమంలో కన్వీనర్ కాయం శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, కట్టా సతీష్, జూదాల సుధాకర్, శంకర్, శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

గూడూరు

గూడూరులో ₹32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

గూడూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి 28వ విడత చెక్కుల పంపిణీ జరిగింది. దాదాపు ₹32 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF భరోసాగా నిలుస్తోందన్నారు. అర్హులైన బాధితులకు సహాయం అందేలా స్థానిక నాయకులు చొరవ చూపాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీలే టార్గెటా?.. ప్రశ్నిస్తే కేసులా?|అనిల్ కుమార్ యాదవ్

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ‘X’ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు యాదృచ్ఛికం కావని ఆరోపించారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచే లక్ష్యంతోనే కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొంటూ, కక్షసాధింపు రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు.-+

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమంచర్ల భూములు అటవీ భూములు కావు: ప్రభుత్వం

నెల్లూరు రూరల్ మండలం అమంచర్ల సర్వే నంబర్ 303/1కు సంబంధించిన భూములు రెవెన్యూ భూములేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 1908 RSR, 1921 ఆర్కైవ్ మ్యాప్‌లు, జాయింట్ కమిటీ పరిశీలన ఆధారంగా అమంచర్ల వెస్ట్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా నిర్వహించిన ఆధారాలు లేవని తెలిపింది. 1980 అటవీ సంరక్షణ చట్టం కూడా ఈ భూములకు వర్తించదని తుది ప్రకటన చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో వాహనం బోల్తా..17 మందికి గాయాలు

నెల్లూరు, బుజబుజ నెల్లూరు సమీపంలో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడటంతో 17 మంది జార్ఖండ్ కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంటనే జీజీహెచ్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్య సేవలను పరిశీలించి, గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున, ఐసీయూ బాధితుడికి రూ.లక్ష తక్షణ సాయం అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యుల అద్భుత ప్రతిభ : బాలింతకు పునర్జన్మ*

*- హెమరేజిక్ షాక్, మూత్రపిండాల వైఫల్యం నుంచి మహిళను కాపాడిన అపోలో వైద్య నిపుణుల బృందం* * 12 రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ సాయంతో అత్యాధునిక చికిత్స *మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అపోలో వైద్య బృందం సాధారణ కాన్పు తర్వాత తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుని, అవయవాల వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్న 40 ఏళ్ల బాలింతకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి. జి. లక్ష్మి దుర్గ, సీనియర్ కన్సల్టెంట్,ఎమర్జెన్సీ & క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ యం.శ్రీనివాస్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఎ. కె. చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వల్లి ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి లు వివరాలు వెల్లడించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం గర్భాశయ సంకోచ వైఫల్యం, గర్భాశయ ముఖద్వారంలో చీలికల కారణంగా తీవ్ర రక్తస్రావం (PPH) సంభవించిందని, రక్తపోటు పడిపోయి హెమరేజిక్ షాక్ మరియు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్‌పై అత్యంత విషమ స్థితిలో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. అపోలోలో చేరే సమయానికి రోగి పరిస్థితి తీవ్రంగా విషమించి, తెల్ల రక్తకణాలు అధికమై, ప్లేట్‌లెట్లు 71,000కి పడిపోవడంతో పాటు రక్తం గడ్డకట్టే సామర్థ్యం పూర్తిగా దెబ్బతిని (DIC), తీవ్ర ఇన్ఫెక్షన్ మరియు మూత్రపిండాల వైఫల్యం (AKI)తో రోగి ప్రాణాలతో పోరాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అపోలో మల్టీడిసిప్లినరీ బృందం రోగికి యుద్ధప్రాతిపదికన 4 యూనిట్ల ఎర్ర రక్తకణాలు, 8 యూనిట్ల ప్లాస్మా, 6 యూనిట్ల క్రయోప్రెసిపిటేట్‌తో భారీ రక్తమార్పిడి నిర్వహించింది. రక్తపోటును స్థిరీకరించడానికి అధునాతన మందులు, శ్వాసకోశ వైఫల్యానికి మెకానికల్ వెంటిలేటర్, మూత్రపిండాల రక్షణ కోసం పలుమార్లు డయాలసిస్ సెషన్లు నిర్వహించడంతో పాటు తీవ్ర ఇన్ఫెక్షన్ నివారణకు హై-ఎండ్ యాంటీబయాటిక్స్‌తో సుమారు 12 రోజుల పాటు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణతో కూడిన చికిత్స అందించారు. వైద్యుల నిరంతర కృషి, అపోలోలోని అత్యాధునిక మౌలిక వసతుల ఫలితంగా రోగి ఆరోగ్యం క్రమంగా కుదుటపడి, మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకోవడంతో వెంటిలేటర్ మరియు రక్తపోటు మందుల అవసరం లేకుండానే పూర్తిగా కోలుకున్నారు. అనంతరం మూడు రోజుల పాటు వార్డులో పర్యవేక్షించి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా డిశ్చార్జ్ చేశామని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో సకాలంలో స్పందించడం, అత్యాధునిక బ్లడ్ బ్యాంక్, ఐసీయూ సదుపాయాలతో కూడిన సమగ్ర నిపుణుల బృందం అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి సంక్లిష్ట కేసుల్లో ప్రాణాలు కాపాడటం సాధ్యమైందని, నెల్లూరు ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని ఆసుపత్రి వైద్య బృందం ఈ సందర్భంగా పేర్కొంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం సమావేశానికి ఏపీ హంస ను ఆహ్వానించాలి

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు కోరారు. ఆరోగ్యశాఖ ఉద్యోగుల డీఏలు, ఐఆర్, పీఆర్సీ, సరెండర్ లీవులు, పదవీ విరమణ ప్రయోజనాలు, బకాయిలు, బదిలీలు, ప్రమోషన్లు, సిబ్బంది కొరత తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో కమల్ కిరణ్, అరవ పరిమళ, మజార్, గౌస్ బాషా, నాగయ్య, జయలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హరికృష్ణకు బీద రవిచంద్ర నివాళి

నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఘనంగా నివాళులర్పించారు. నటుడిగా, ప్రజానేతగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిండు మనసు, నిరాడంబరత, చెదరని చిరునవ్వు హరికృష్ణ ప్రత్యేకతలని కొనియాడారు. ప్రజల ప్రేమాభిమానాలు పొందిన మహానేతగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో హరికృష్ణ స్థానం శాశ్వతమని, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. హరికృష్ణ వ్యక్తిత్వం, సేవాభావం, క్రమశిక్షణ ప్రతి కార్యకర్తకు మార్గదర్శకంగా నిలుస్తాయని బీద రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.