Friday, 11 September 2026
  • Home  
  • కలిసి ఉన్నప్పుడు మంచివారు.. పార్టీ మారాక చెడ్డవారా? అనిల్‌పై బీద ఫైర్”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిసి ఉన్నప్పుడు మంచివారు.. పార్టీ మారాక చెడ్డవారా? అనిల్‌పై బీద ఫైర్”

అనిల్…. 2024 ఎన్నికల ముందు వరకు వేమిరెడ్డి దంపతుల వయస్సు, వారి డబ్బు, అహంకారం గురించి తెలీదా, పార్టీ మారాకే తెలుసుకున్నావా ? వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల గురించి సోమిరెడ్డి అవపోసన పట్టగలిగారు తప్ప కాకాణిలా వినూత్న చదువులు చదవలేకపోయారు. కల్తీ మద్యం లో డిప్లొమా, డాకుమెంట్స్ ఫోర్జెరీ లో డిగ్రీ, కోర్టుల్లో డాకుమెంట్స్ ఎలా మాయం చేయాలనే అంశం పై పీజీని కాకాణి లా సోమిరెడ్డి చదవలేకపోయారు. వీపీఆర్ దంపతుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, పట్టాభిషేకాలు చేస్తున్నప్పుడు వీపీఆర్ దంపతుల అవినీతి అనిల్, ప్రసన్నలకు తెలియలేదా? విశ్వాసం, పార్టీ మార్పుల గురించి ప్రశ్నించే అర్హత ప్రసన్న కుమార్ రెడ్డి కి లేదు. అవసరానికి పొగడటం, తర్వాత నోటికొచ్చినట్టు తిట్టడం ప్రసన్నకు అలవాటే* అనిల్…. సూటిగా అడుగుతున్న నీకేం కావాలి ? ఏం ఆశించి వీపీఆర్ దంపతులపై విమర్శలు చేస్తున్నావ్? 15 రోజులుగా గందరగోళం చేస్తున్నావ్ ? వీపీఆర్ భుజాలపై తుపాకి పెట్టి ఎవరిని కాల్చలని అనుకుంటున్నావ్ అనిల్ ? నీ కోపం ద్వేషం ఎవరిపై? సేవా కార్యక్రమాలపై కూడా బురద చల్లడమేనా? పదే పదే దమ్ము, ధైర్యం, మగతనం గురించి మాట్లాడుతున్న అనిల్…… వీపీఆర్ దమ్ము ఏపాటిదో 2019, 2024 ఎన్నికల్లో చూడలేదా? 2029 ఎన్నికల్లో మరోసారి చూడటానికి సిద్ధం గా ఉండు అనిల్ కలిసి ఉన్నప్పుడు, ప్రయోజనాలు కలుగుతున్నపుడు మంచివారుగా, పార్టీ మారాక చెడ్డవారుగా వేమిరెడ్డి దంపతులు మారిపోయారా అనిల్ ? యువనేత నారాలోకేష్ చేతుల మీదుగా కోవూరు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ త్వరలో జరగనుంది. 1983 నుండి 2009 వరకు కోవూరు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి సాధ్యం కానిది, వీపీఆర్ దంపతులు సుసాధ్యం చేశారు. బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జెన్ని రవణయ్య, భూలక్ష్మి, పి యల్ రావు, మామిడాల మధు, అమృల్లా, దర్శి హరికృష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ…* విపిఆర్ దంపతులపై అనిల్, ప్రసన్న పదేపదే చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలను, బెదిరింపులను తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపిఆర్ దంపతులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వీపీఆర్ తెలుగుదేశం పార్టీ లో చేరాక ఏమైనా కాంట్రాక్టర్ అయ్యారా? వారు 1989 నుంచే మైనింగ్ రంగంలో ఉన్నారు. వారి కుటుంబం 1951 నుంచే మైనింగ్ వ్యాపారం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వై ఎస్ రాజా రెడ్డికి సైదాపురం, రాపూరు ప్రాంతాలలో మైనింగ్ భూములు అమ్మిన చరిత్ర వీపీఆర్ కుటుంబానిది. నల్లపరెడ్డి,ఆనం, మాగుంట, ఆదాల…. వంటి కుటుంబాల సేవల గురించి వీపీఆర్ ఏనాడు ప్రస్తావన తేలేదు, తమ కుటుంబం ఒక్కటే సేవ చేస్తోందని వీపీఆర్ ఏనాడు చెప్పలేదు, కుట్ర పూరితంగా లేని పోని పోలికలను అనిల్ తెస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వీపీఆర్ ట్రస్ట్ స్థాపించి 2 వేల పేద విద్యార్థులకు అండగా నిలిచారు. వీపీఆర్ నేత్ర ద్వారా 1.2 లక్షల మందికి నేత్ర పరీక్షలు, 70 వేల కంటి అద్దాలు అందించారు. 200 కు పైగా ఆర్వో ప్లాంట్ లు పెట్టి దాహార్తి తీర్చడమే కాక, ప్రత్యేక టీమ్ లు పెట్టి వాటి నిర్వహణ ను సమర్థవంతంగా చేస్తున్నారు. 2029 ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా, ప్రజా మద్దతు ఏ పాటిదో వీపీఆర్ దంపతులకు ప్రసన్న, అనిల్ చూపించాలని కోరుకుంటున్నాను. చదువు రాని సోమిరెడ్డి అంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలతో కాకాణి స్థాయి, మానసిక స్థితి ఏమిటో జిల్లా ప్రజలు తెలుసుకున్నారు. సోమిరెడ్డి గారి స్థాయి తగ్గించి మాట్లాడుతున్నా అనుకుని, తన స్థాయిని కాకాణి దిగజార్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల పక్షాన, నమ్మిన పార్టీ కోసం నిలబడే నాయకుడు సోమిరెడ్డి. జడ్పీ ఛైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన కాకాణి కి “ఎదుటి వారి గురించి ఎలా మాట్లాడాలి” అనే కనీస స్పృహ లేకపోవడం విచారకరం. ఏపీపిఎస్సీ నిర్వహణ లో జరిగిన అక్రమాల గురించి న్యాయస్థానాలలో విచారణ మొదలు కాగానే వైస్సార్సీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టింది. ఏపీపిఎస్సీ నిర్వహణలో నాటి మంత్రులు, సకల శాఖల సజ్జల రామకృష్ణా రెడ్డి తో సహా కీలక నేతలు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం ఒక మంచి పని మొదలెట్టిన ప్రతీసారి బూటకపు ప్రచారం తో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. 2019 ఎన్నికల ముందు, 2014-19 మధ్య కాలంలో వైసీపీ నేతలు అబద్దపు ప్రచారాలను నమ్ముకున్నారు. గతంలో పింక్ డైమండ్, కమ్మ కులస్థులకే డీఎస్పీ పదోన్నతులు, వివేకా హత్య, కోడి కత్తి శీను ఘటన….వంటి విష ప్రచారాలతో ప్రజలను మోసం చేశారు. వైస్సార్సీపీ పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు అబద్దపు ప్రచారాలనే నమ్ముకుంది, ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయినా నేతల బుద్ధి మాత్రం మారలేదు.

అనిల్…. 2024 ఎన్నికల ముందు వరకు వేమిరెడ్డి దంపతుల వయస్సు, వారి డబ్బు, అహంకారం గురించి తెలీదా, పార్టీ మారాకే తెలుసుకున్నావా ?

వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల గురించి సోమిరెడ్డి అవపోసన పట్టగలిగారు తప్ప కాకాణిలా వినూత్న చదువులు చదవలేకపోయారు.
కల్తీ మద్యం లో డిప్లొమా, డాకుమెంట్స్ ఫోర్జెరీ లో డిగ్రీ, కోర్టుల్లో డాకుమెంట్స్ ఎలా మాయం చేయాలనే అంశం పై పీజీని కాకాణి లా సోమిరెడ్డి చదవలేకపోయారు.

వీపీఆర్ దంపతుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, పట్టాభిషేకాలు చేస్తున్నప్పుడు వీపీఆర్ దంపతుల అవినీతి అనిల్, ప్రసన్నలకు తెలియలేదా?
విశ్వాసం, పార్టీ మార్పుల గురించి ప్రశ్నించే అర్హత ప్రసన్న కుమార్ రెడ్డి కి లేదు. అవసరానికి పొగడటం, తర్వాత నోటికొచ్చినట్టు తిట్టడం ప్రసన్నకు అలవాటే*

అనిల్…. సూటిగా అడుగుతున్న నీకేం కావాలి ? ఏం ఆశించి వీపీఆర్ దంపతులపై విమర్శలు చేస్తున్నావ్? 15 రోజులుగా గందరగోళం చేస్తున్నావ్ ?
వీపీఆర్ భుజాలపై తుపాకి పెట్టి ఎవరిని కాల్చలని అనుకుంటున్నావ్ అనిల్ ? నీ కోపం ద్వేషం ఎవరిపై? సేవా కార్యక్రమాలపై కూడా బురద చల్లడమేనా?
పదే పదే దమ్ము, ధైర్యం, మగతనం గురించి మాట్లాడుతున్న అనిల్…… వీపీఆర్ దమ్ము ఏపాటిదో 2019, 2024 ఎన్నికల్లో చూడలేదా? 2029 ఎన్నికల్లో మరోసారి చూడటానికి సిద్ధం గా ఉండు అనిల్

కలిసి ఉన్నప్పుడు, ప్రయోజనాలు కలుగుతున్నపుడు మంచివారుగా, పార్టీ మారాక చెడ్డవారుగా వేమిరెడ్డి దంపతులు మారిపోయారా అనిల్ ?
యువనేత నారాలోకేష్ చేతుల మీదుగా కోవూరు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ త్వరలో జరగనుంది. 1983 నుండి 2009 వరకు కోవూరు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి సాధ్యం కానిది, వీపీఆర్ దంపతులు సుసాధ్యం చేశారు.
బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు.
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జెన్ని రవణయ్య, భూలక్ష్మి, పి యల్ రావు, మామిడాల మధు, అమృల్లా, దర్శి హరికృష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ…*
విపిఆర్ దంపతులపై అనిల్, ప్రసన్న పదేపదే చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలను, బెదిరింపులను తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపిఆర్ దంపతులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

వీపీఆర్ తెలుగుదేశం పార్టీ లో చేరాక ఏమైనా కాంట్రాక్టర్ అయ్యారా? వారు 1989 నుంచే మైనింగ్ రంగంలో ఉన్నారు. వారి కుటుంబం 1951 నుంచే మైనింగ్ వ్యాపారం చేస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వై ఎస్ రాజా రెడ్డికి సైదాపురం, రాపూరు ప్రాంతాలలో మైనింగ్ భూములు అమ్మిన చరిత్ర వీపీఆర్ కుటుంబానిది.

నల్లపరెడ్డి,ఆనం, మాగుంట, ఆదాల…. వంటి కుటుంబాల సేవల గురించి వీపీఆర్ ఏనాడు ప్రస్తావన తేలేదు, తమ కుటుంబం ఒక్కటే సేవ చేస్తోందని వీపీఆర్ ఏనాడు చెప్పలేదు, కుట్ర పూరితంగా లేని పోని పోలికలను అనిల్ తెస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా వీపీఆర్ ట్రస్ట్ స్థాపించి 2 వేల పేద విద్యార్థులకు అండగా నిలిచారు. వీపీఆర్ నేత్ర ద్వారా 1.2 లక్షల మందికి నేత్ర పరీక్షలు, 70 వేల కంటి అద్దాలు అందించారు.

200 కు పైగా ఆర్వో ప్లాంట్ లు పెట్టి దాహార్తి తీర్చడమే కాక, ప్రత్యేక టీమ్ లు పెట్టి వాటి నిర్వహణ ను సమర్థవంతంగా చేస్తున్నారు.
2029 ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా, ప్రజా మద్దతు ఏ పాటిదో వీపీఆర్ దంపతులకు ప్రసన్న, అనిల్ చూపించాలని కోరుకుంటున్నాను.
చదువు రాని సోమిరెడ్డి అంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలతో కాకాణి స్థాయి, మానసిక స్థితి ఏమిటో జిల్లా ప్రజలు తెలుసుకున్నారు.

సోమిరెడ్డి గారి స్థాయి తగ్గించి మాట్లాడుతున్నా అనుకుని, తన స్థాయిని కాకాణి దిగజార్చుకుంటున్నారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల పక్షాన, నమ్మిన పార్టీ కోసం నిలబడే నాయకుడు సోమిరెడ్డి.
జడ్పీ ఛైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన కాకాణి కి “ఎదుటి వారి గురించి ఎలా మాట్లాడాలి” అనే కనీస స్పృహ లేకపోవడం విచారకరం.

ఏపీపిఎస్సీ నిర్వహణ లో జరిగిన అక్రమాల గురించి న్యాయస్థానాలలో విచారణ మొదలు కాగానే వైస్సార్సీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టింది.
ఏపీపిఎస్సీ నిర్వహణలో నాటి మంత్రులు, సకల శాఖల సజ్జల రామకృష్ణా రెడ్డి తో సహా కీలక నేతలు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు.
కూటమి ప్రభుత్వం ఒక మంచి పని మొదలెట్టిన ప్రతీసారి బూటకపు ప్రచారం తో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు.
2019 ఎన్నికల ముందు, 2014-19 మధ్య కాలంలో వైసీపీ నేతలు అబద్దపు ప్రచారాలను నమ్ముకున్నారు.

గతంలో పింక్ డైమండ్, కమ్మ కులస్థులకే డీఎస్పీ పదోన్నతులు, వివేకా హత్య, కోడి కత్తి శీను ఘటన….వంటి విష ప్రచారాలతో ప్రజలను మోసం చేశారు.
వైస్సార్సీపీ పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు అబద్దపు ప్రచారాలనే నమ్ముకుంది, ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయినా నేతల బుద్ధి మాత్రం మారలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.