Monday, 21 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సి.వి.ఐ.పి, పి4 అమలుపై సీఎం సమీక్ష : వై.ఓ. నందన్

రాష్ట్రంలోని సి.వి.ఐ.పి యూనిట్లు, పి4 కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, కమిషనర్ వై.ఓ. నందన్ సమావేశంలో పాల్గొని కె.పి.ఐ పురోగతి, పి4 అమలు, పి.జీ.ఆర్.ఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరిశుభ్రతలో రాజీ వద్దు: కమిషనర్ వై.ఓ. నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం నగరోదయం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు రోడ్డు కూడలి పరిధిలోని శానిటేషన్ మస్టర్ పాయింట్‌ను తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి, విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రేడియం ఆప్రాన్స్ ధరించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రతకు నిర్దేశించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. చెత్త సేకరణ వాహనాల సిబ్బంది తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా సేకరించి రీసైక్లింగ్‌కు పంపించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జెన్-జీ ఆకాంక్షలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రీహర్ష కోచింగ్ సెంటర్‌లో సుమారు 500 మంది విద్యార్థులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాదాపు మూడు గంటలపాటు ఆత్మీయ భేటీ నిర్వహించారు. జెన్-జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకు మంత్రి నారా లోకేష్ బంగారు బాట వేస్తున్నారని అన్నారు. నెల్లూరు రూరల్ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జెన్-జీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 51 రోజులపాటు 51 ప్రాంతాల్లో జెన్-జీ యువతతో ఆత్మీయ భేటీలు నిర్వహిస్తూ దాదాపు 20 వేల మంది విద్యార్థులను నేరుగా కలిశారు. పార్థసారథి నగర్‌లోని జెనెక్స్ కాలేజీలో సుమారు 1000 మంది విద్యార్థులతో నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. యువత ప్రశ్నించే తత్వం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. వారి ఆకాంక్షలు, మనోభావాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని, జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా శాసనసభ్యుడిగా పనిచేస్తానని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి: ఏపీటీఎఫ్ ధర్నా

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య స్పెషల్ టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి, బోధించే సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జుల్ఫికర్ ఆలీ, బాలత్రిపుర సుందరి, రియాజ్ పిచ్చిబాబు, కరీం మొహిద్దిన్, ఖాదర్ బాషా, మహేంద్ర రెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, రత్నయ్య, యాసిన్, గుప్తా, రామసుబ్బారెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రమణయ్య, పెంచలయ్య, రామ్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, రత్నారెడ్డి, మహేష్, వెంగయ్య పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పన్ను వసూళ్ల లక్ష్యాల సాధనపై కమిషనర్ సమీక్ష

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 2026-27 తొలి అర్థ సంవత్సరం ముగింపుకు 36 రోజులే మిగిలి ఉన్నందున నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కొత్త భవనాలు, ఖాళీ స్థలాలు, అదనపు అంతస్తులను గుర్తించి పన్ను పరిధిలోకి తేవాలని సూచించారు. లోక్ అదాలత్ నోటీసుల అనంతరం కూడా బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని, పౌర సేవల దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజూ బకాయి వసూళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీపీఆర్ఓ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బాలల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు

నెల్లూరులోని జనహిత వాత్సల్య సొసైటీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలకు జీవనం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్య హక్కులు ఉన్నాయని తెలిపారు. బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర బాలల సహాయానికి 1098, ఉచిత న్యాయ సహాయానికి 15100 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అనంతరం హాస్టల్ వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మైపాడు గేటు వద్ద మృత్యుగుంత!

మైపాడు గేటు దగ్గర కేసీఆర్ కళ్యాణ మండపం సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ జెంట్స్ టాయిలెట్ దగ్గర అత్యంత ప్రమాదకరంగా మ్యాన్ హోల్ ఉన్నది పైన కేవలం ఒక రేకు మాత్రమే చేసి ఉన్నారు మెయిన్ రోడ్ లోనే ఉంది ఏమాత్రం వాహనం వస్తే పడిపోవడం తప్ప మార్గం లేదు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ. నందన్ ప్రజల నుంచి మొత్తం 50 వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా శాశ్వత పరిష్కారం అందిస్తామని మేయర్ తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. నవాబుపేట, మేకలమండి, మినీ బైపాస్, ఎన్టీఆర్ పార్కు ప్రాంతాల్లో ఆక్రమణల నివారణకు ప్రత్యేక కమిటీ ద్వారా చర్యలు చేపడతామన్నారు. వీధి వ్యాపారులు నిర్దేశించిన రోడ్డు మార్జిన్‌లోనే వ్యాపారం చేయాలని సూచించారు. నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను రోడ్లపై వదలరాదని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను నగరపాలక సంస్థ ద్వారా తరలించేందుకు 94940 18118 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, ఆరోగ్య, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

మన శరీరం – 5 తో కూడిన అద్భుతాలు

​రక్తం పరిమాణం: మన ఒంట్లో ఉండే రక్తం సుమారు 5 లీటర్లు. ​గుండె పంపింగ్ సామర్థ్యం: ప్రశాంతంగా ఉన్నప్పుడు మన గుండె నిమిషానికి పంప్ చేసే రక్తం 5 లీటర్లు. ​రక్తంలో చక్కెర: 5 లీటర్ల మొత్తం రక్తంలో ఉండే చక్కెర పరిమాణం కేవలం 5 గ్రాములు (ఒక టీస్పూన్). ​ఊపిరితిత్తుల భాగాలు: రెండు ఊపిరితిత్తుల్లో కలిపి ఉండే మొత్తం తమ్మెలు (Lobes) 5 (కుడి వైపు 3, ఎడమ వైపు 2). ​తెల్ల రక్త కణాలు: రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషించే తెల్ల రక్త కణాలు 5 రకాలు (న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్). ​ప్రాథమిక రుచులు: మన నాలుక గుర్తించగల ప్రాథమిక రుచులు 5 (తీపి, పులుపు, ఉప్పు, చేదు, ఉమామి). ​ఇమ్యునోగ్లోబులిన్లు: ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రధాన యాంటీబాడీలు (ఇమ్యునోగ్లోబులిన్లు) 5 రకాలు (IgG, IgA, IgM, IgE, IgD). ​శరీరంలో ‘5’ తో కూడిన మరికొన్ని అద్భుతాలు ​పంచేంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు): బాహ్య ప్రపంచాన్ని గ్రహించడానికి ప్రకృతి మనకిచ్చిన కిటికీలు 5 (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం). ​పంచాంగుళ నిర్మాణం (చేతి, కాలి వేళ్ళు): ప్రతి చేతికి 5 వేళ్ళు, ప్రతి కాలికి 5 వేళ్ళు ఉండటం క్షీరదాల సహజ నిర్మాణం. ​అరిచేతి ఎముకలు (Metacarpals): ప్రతి అరిచేతి నిర్మాణంలో ఆధారంగా ఉండే మెటాకార్పల్ ఎముకలు 5. ​నడుము వెన్నుపూసలు (Lumbar Vertebrae): శరీర బరువును మోసే కింది నడుము భాగంలో ఉండే ప్రధాన వెన్నుపూసలు 5 (L1 నుండి L5).

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.