నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం ఆచారి వీధి, జి.ఎన్.టి రోడ్డు, చిన్న బజారు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైన్ల నిర్మాణం, సీసీ రోడ్లు, ప్యాచ్‌వర్క్‌ల నాణ్యతను పరిశీలించి, పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. చిన్న బజారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రూట్ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్.ఈ. రహంతు జానీ, ఈ.ఈ. చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



