Wednesday, 16 September 2026

Tag: Nellore Municipal Corporation

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : వై.ఓ. నందన్

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో పారిశుధ్య పనులను మరింత సమర్థంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శానిటేషన్ విభాగంతో నిర్వహించిన సమీక్షలో డ్రైన్ల పూడికతీత, చెత్త తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రతిరోజూ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. GVPలు, బ్లాక్‌స్పాట్లను గుర్తించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సిబ్బంది యూనిఫామ్‌తో విధులకు హాజరై, వార్డు వర్కర్ల హాజరును నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, డాక్టర్ జిజియా, డాక్టర్ మదన్మోహన్, శానిటరీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పారిశుద్ధ్య పనులపై కమిషనర్ వై.ఓ. నందన్ తనిఖీ

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం ఆచారి వీధి, జి.ఎన్.టి రోడ్డు, చిన్న బజారు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైన్ల నిర్మాణం, సీసీ రోడ్లు, ప్యాచ్‌వర్క్‌ల నాణ్యతను పరిశీలించి, పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. చిన్న బజారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రూట్ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్.ఈ. రహంతు జానీ, ఈ.ఈ. చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.