ముధోల్,ఆగస్టు 8(పున్నమి ప్రతినిధి ):లోకేశ్వర్ మండలంలోని ధర్మోరా గ్యానాషేతు పాఠశాల లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిలా అలంకరించుకున్న విద్యార్థినులు, పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



