Wednesday, 15 April 2026
  • Home  
  • జాతీయ స్థాయి ఇస్రో యువికా-2026 కార్యక్రమానికి చిట్వేల్ విద్యార్థి ఎంపిక
- అన్నమయ్య

జాతీయ స్థాయి ఇస్రో యువికా-2026 కార్యక్రమానికి చిట్వేల్ విద్యార్థి ఎంపిక

అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండల కేంద్రంలోని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిల్లావాండ్లపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి కుశాల్ అనే ప్రతిభావంతుడు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా-2026)”కు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా మండలానికి, జిల్లాకు గర్వకారణమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం మొత్తం 456 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కావడం విశేషం. ఆ ఎంపికలో చిట్వేల్ ప్రాంతానికి చెందిన విద్యార్థి కుశాల్ స్థానం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ప్రతి సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల కోసం యువికా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. భారతదేశం అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచ అగ్రదేశాలకు పోటీగా ఎదుగుతూ, వందలాది విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేస్తోందని, ఈ విజయాలను విద్యార్థులకు చేరవేసి వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ యువికా-2026 కార్యక్రమం మే 11 నుండి మే 22 వరకు దేశంలోని 7 ప్రధాన ఇస్రో కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు ఉపగ్రహాల నిర్మాణం, రాకెట్ సాంకేతికత, అంతరిక్ష ప్రయోగాలు, గ్రహాల పరిశోధన వంటి అనేక శాస్త్రీయ అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా, ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా కల్పించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణం, భోజనం, వసతి వంటి అన్ని సౌకర్యాలను ఇస్రో సంస్థే భరిస్తుంది. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులు స్పేస్ సెంటర్లను సందర్శించి, అక్కడి ఆధునిక సాంకేతిక పరికరాలను పరిశీలించే అవకాశం పొందుతారు. సప్తగ్రహ కూటమి, అంతరిక్ష విశేషాలు, భూమి-గ్రహాల గమనాలు వంటి ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు సులభంగా వివరించి విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు.మే 22న జరిగే ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెంపొందించి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుందని ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇస్రో యువికా-2026కు ఎంపికైన రామిశెట్టి కుశాల్‌ను పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివనారాయణ గౌడ్, తిరుమల విశ్వనాథం, సోఫియా, లక్ష్మీకళావతి, సుహాసిని, సునీత కుమారి, సుభాష్ చంద్రబోస్, నవీన్ కుమార్, రాజశేఖర్, వెంకట రమణ, ప్రవీణ్ కుమార్ తదితరులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది విద్యార్థి కుశాల్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండల కేంద్రంలోని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిల్లావాండ్లపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి కుశాల్ అనే ప్రతిభావంతుడు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా-2026)”కు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా మండలానికి, జిల్లాకు గర్వకారణమైంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం మొత్తం 456 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కావడం విశేషం. ఆ ఎంపికలో చిట్వేల్ ప్రాంతానికి చెందిన విద్యార్థి కుశాల్ స్థానం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ప్రతి సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల కోసం యువికా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. భారతదేశం అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచ అగ్రదేశాలకు పోటీగా ఎదుగుతూ, వందలాది విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేస్తోందని, ఈ విజయాలను విద్యార్థులకు చేరవేసి వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఈ యువికా-2026 కార్యక్రమం మే 11 నుండి మే 22 వరకు దేశంలోని 7 ప్రధాన ఇస్రో కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు ఉపగ్రహాల నిర్మాణం, రాకెట్ సాంకేతికత, అంతరిక్ష ప్రయోగాలు, గ్రహాల పరిశోధన వంటి అనేక శాస్త్రీయ అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా, ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా కల్పించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతారు.
ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణం, భోజనం, వసతి వంటి అన్ని సౌకర్యాలను ఇస్రో సంస్థే భరిస్తుంది. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులు స్పేస్ సెంటర్లను సందర్శించి, అక్కడి ఆధునిక సాంకేతిక పరికరాలను పరిశీలించే అవకాశం పొందుతారు. సప్తగ్రహ కూటమి, అంతరిక్ష విశేషాలు, భూమి-గ్రహాల గమనాలు వంటి ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు సులభంగా వివరించి విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు.మే 22న జరిగే ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెంపొందించి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుందని ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇస్రో యువికా-2026కు ఎంపికైన రామిశెట్టి కుశాల్‌ను పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివనారాయణ గౌడ్, తిరుమల విశ్వనాథం, సోఫియా, లక్ష్మీకళావతి, సుహాసిని, సునీత కుమారి, సుభాష్ చంద్రబోస్, నవీన్ కుమార్, రాజశేఖర్, వెంకట రమణ, ప్రవీణ్ కుమార్ తదితరులు హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది విద్యార్థి కుశాల్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.