Saturday, 30 May 2026
  • Home  
  • చెత్తపై క్లీన్ స్వీప్.. స్వచ్ఛ యలమంచిలికి ఎమ్మెల్యే శ్రీకారం…!
- అనకాపల్లి

చెత్తపై క్లీన్ స్వీప్.. స్వచ్ఛ యలమంచిలికి ఎమ్మెల్యే శ్రీకారం…!

శ్రమదానంతో ప్రజల్లో పరిశుభ్రత చైతన్యo (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలోని యలమంచిలి మున్సిపాలిటీ టౌన్ ఫైర్ ఆఫీస్ కాలనీలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యం”లో భాగంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వయంగా శ్రమదానంలో పాల్గొని చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బుధవారం నిర్వహించే “స్వచ్ఛ బుధవారం” కార్యక్రమంతో పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. ప్రధాన వీధులు, కాలనీలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం ద్వారా వ్యాధుల నివారణ సాధ్యమవుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు.

శ్రమదానంతో ప్రజల్లో పరిశుభ్రత చైతన్యo

(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)

అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలోని యలమంచిలి మున్సిపాలిటీ టౌన్ ఫైర్ ఆఫీస్ కాలనీలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యం”లో భాగంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వయంగా శ్రమదానంలో పాల్గొని చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బుధవారం నిర్వహించే “స్వచ్ఛ బుధవారం” కార్యక్రమంతో పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. ప్రధాన వీధులు, కాలనీలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం ద్వారా వ్యాధుల నివారణ సాధ్యమవుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.