ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 12 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని పురిటిపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో “కరంటోళ్ల జనబాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 11 కెవి, ఎల్టీ లైన్ల పరిస్థితిని పరిశీలిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులతో అధికారులు మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కరించగలిగిన పనులను అక్కడికక్కడే పూర్తి చేయించారు. కార్యక్రమంలో ఏడీఈఈ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.


