శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో ఒకటైన సూళ్లూరుపేట మండలం, మన్నారు పోలూరు చారిత్రక శ్రీ మల్లారి కృష్ణ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని స్థానిక నాయకులు కోరారు. ఆలయ పునర్నిర్మాణం, భక్తుల మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం దేవాలయాన్ని సందర్శించవలసిందిగా టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు గరికపాటి రమేష్ బాబు గ్రామ ప్రజలతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రానికి నిత్యం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ఇక్కడ నిత్య అన్నప్రసాద భవనం, క్యూలైన్లు, తాగునీరు, కల్యాణ మండపం వంటి శాశ్వత పనులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఈ పుణ్యక్షేత్రం రూపురేఖలను మార్చేలా టీటీడీ పాలకమండలి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ఉన్నతాధికారులతో చర్చించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్నారు పోలూరు గ్రామ ప్రముఖులు, అచలమార్గ ప్రవర్తకులు, బీజేపీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ తక్షణ అవసరాలను ప్రతినిధులకు వివరించారు.

మన్నారు పోలూరు ఆలయా భివృద్ధికి నిధులు మంజూరు చేయాలి-బీజేపీ నేత రమేష్ బాబు