రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 8:( పున్నమి ప్రతినిధి)
మాజీ సర్పంచుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
సిరిసిల్ల, ఆగస్టు 8: మాజీ సర్పంచుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచులకు పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ సర్పంచుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, తక్షణమే పెన్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



2 Comments
Balaji
August 8, 2026news
Balaji
August 8, 2026today News send