తిరుపతి ఆగస్టు 8 (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చేస్తున్న సోషల్ మీడియా నూరు రోజుల ఉద్యమం ముగింపు కాదు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం ఇది నాంది మాత్రమేనని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ తెలియజేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రజాప్రతినిధలను కలసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను, న్యాయమైన డిమాండ్లపై వినతి పత్రాలు సమర్పించ నున్నట్లు తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు గ్రాట్యుటీ , మెడికల్, రిటైర్మెంట్ తదితర చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.స్పందించకపోతే రానున్న జనవరి 1వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష పోరుకు తామంతా సిద్ధమవుతామని అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిరంతరం వెలుగులు నింపే విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్రంలోని 30 వేల విద్యుత్ కాంట్రాక్టు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు గుణశేఖర్, ప్రహ్లాదయ్య, దివాకర్ రెడ్డి, శివకుమార్, మూర్తి, చంద్ర, ఉదయ్ కుమార్, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.


