ముధోల్:08ఆగస్టు(పున్నమి ప్రతినిధి ):ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలోని ప్యూచర్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, పోతరాజు, శివసత్తుల వేషధార ణలతో ఆకట్టుకున్నారు.బోనాలతో నెత్తిన ఎత్తుకొని పోతరాజు, శివస త్తులు తెలంగాణ బోనాల పండుగ పాటల పైన నృత్యాలు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. దీంతో బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


