Sunday, 27 September 2026
  • Home  
  • ఎస్ వి యూనివర్సిటీ హెర్బల్ మెడిసిన్ సదస్సుకు డాక్టర్ పసుపులేటి శంకర్ ప్రత్యేక ఆహ్వానం
- కడప

ఎస్ వి యూనివర్సిటీ హెర్బల్ మెడిసిన్ సదస్సుకు డాక్టర్ పసుపులేటి శంకర్ ప్రత్యేక ఆహ్వానం

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వావిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక హెర్బల్ మెడిసిన్ టెక్నాలజీ సదస్సుకు ఒంటిమిట్ట శ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పసుపులేటి శంకర్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించారు. ఈ నెల ఆగస్టు 10వ తేదీ నుంచి విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో ప్రారంభమయ్యే ఈ సదస్సు 14 రోజుల పాటు కొనసాగనుంది. హెర్బల్ మెడిసిన్ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, ఔషధ మొక్కల పరిరక్షణ, పరిశోధనలు, భవిష్యత్ అవకాశాలు వంటి కీలక అంశాలపై జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు సదస్సు నిర్వాహక కార్యదర్శి, వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ కామాక్షమ్మ తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ తాతా నరసింగరావు ముఖ్య అతిథిగా, కులసచివులు భూపతినాయుడు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. అలాగే విజయవాడ మెడిసినల్ అండ్ అరోమాటిక్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్, ఎస్‌వీ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ విజయ, విభాగ సమన్వయకర్త డాక్టర్ నాగలక్ష్మీదేవమ్మతో పాటు పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నట్లు వెల్లడించారు. హెర్బల్ మెడిసిన్ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ మొక్కల వినియోగంపై సమగ్ర చర్చలు జరిగే ఈ సదస్సు దేశవ్యాప్తంగా పరిశోధకులు, విద్యార్థులు, వైద్య రంగ నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వావిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక హెర్బల్ మెడిసిన్ టెక్నాలజీ సదస్సుకు ఒంటిమిట్ట శ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పసుపులేటి శంకర్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించారు.
ఈ నెల ఆగస్టు 10వ తేదీ నుంచి విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో ప్రారంభమయ్యే ఈ సదస్సు 14 రోజుల పాటు కొనసాగనుంది. హెర్బల్ మెడిసిన్ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, ఔషధ మొక్కల పరిరక్షణ, పరిశోధనలు, భవిష్యత్ అవకాశాలు వంటి కీలక అంశాలపై జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు సదస్సు నిర్వాహక కార్యదర్శి, వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ కామాక్షమ్మ తెలిపారు.
సదస్సు ప్రారంభోత్సవానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ తాతా నరసింగరావు ముఖ్య అతిథిగా, కులసచివులు భూపతినాయుడు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. అలాగే విజయవాడ మెడిసినల్ అండ్ అరోమాటిక్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్, ఎస్‌వీ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ విజయ, విభాగ సమన్వయకర్త డాక్టర్ నాగలక్ష్మీదేవమ్మతో పాటు పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నట్లు వెల్లడించారు.
హెర్బల్ మెడిసిన్ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ మొక్కల వినియోగంపై సమగ్ర చర్చలు జరిగే ఈ సదస్సు దేశవ్యాప్తంగా పరిశోధకులు, విద్యార్థులు, వైద్య రంగ నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.