Saturday, 8 August 2026
  • Home  
  • మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి
- తిరుపతి

మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి

తిరుపతి, ఆగస్టు 08 (పున్నమి ప్రతినిధి) శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి టీ.కె. స్ట్రీట్ సమీపంలోని కొత్త వీధి వద్ద సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోడ్డిండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు సేవ చేయడంతో పాటు, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు అన్నదాతలుగా తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి ఈరోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. వారి సహకారంతో భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రేమాభిమానాలతో పంపిణీ చేశారు. అన్నదానానికి ముందుకు వచ్చి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించిన తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి కుటుంబ సభ్యులను మన తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందించారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కందమూరు శేషయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ కందమూరు శేషయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, “సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి” అనే నినాదంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాత్రికేయులు వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక బాధ్యతలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని, మన తిరుపతి ప్రెస్ క్లబ్ సేవా కార్యక్రమాలకు తమ ఆశీస్సులు అందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఫౌండర్ తపసి మురళి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, నాగబాల, ధనుంజయ యాదవ్,సాయికుమార్, అనిల్ కుమార్, రెడ్డమ్మ గొడ్డిండ్ల , శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త వినోద్ రాయల్, కీర్తి , అర్చన,భారతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, స్థానికులు, ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

తిరుపతి, ఆగస్టు 08 (పున్నమి ప్రతినిధి)

శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి టీ.కె. స్ట్రీట్ సమీపంలోని కొత్త వీధి వద్ద సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోడ్డిండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు సేవ చేయడంతో పాటు, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈరోజు అన్నదాతలుగా తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి
ఈరోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. వారి సహకారంతో భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రేమాభిమానాలతో పంపిణీ చేశారు. అన్నదానానికి ముందుకు వచ్చి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించిన తపసి జైపాల్ రెడ్డి, వరలక్ష్మి కుటుంబ సభ్యులను మన తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందించారు.
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కందమూరు శేషయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ కందమూరు శేషయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, “సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి” అనే నినాదంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాత్రికేయులు వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక బాధ్యతలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని, మన తిరుపతి ప్రెస్ క్లబ్ సేవా కార్యక్రమాలకు తమ ఆశీస్సులు అందించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఫౌండర్ తపసి మురళి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, నాగబాల, ధనుంజయ యాదవ్,సాయికుమార్, అనిల్ కుమార్, రెడ్డమ్మ గొడ్డిండ్ల , శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త వినోద్ రాయల్, కీర్తి , అర్చన,భారతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, స్థానికులు, ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.