Sunday, 24 May 2026
  • Home  
  • ఇంధన పొదుపుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందేశం కుటుంబ సమేతంగా వందే భారత్‌లో ప్రయాణం
- తిరుపతి

ఇంధన పొదుపుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందేశం కుటుంబ సమేతంగా వందే భారత్‌లో ప్రయాణం

శ్రీ కాళహస్తి, మే 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, ఎమ్మెల్యేలకు లభించే ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలను పక్కనపెట్టి కుటుంబ సమేతంగా వందే భారత్ రైలులో ప్రయాణించినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి వరకు సాగిన ఈ ప్రయాణం ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత చేసిన ఈ రైలు ప్రయాణం బాల్యంలోని మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిందని సుధీర్ రెడ్డి భావోద్వేగంగా వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టగానే తన తండ్రి, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జ్ఞాపకాలు మనసును తాకాయని తెలిపారు. చిన్ననాటి రైలు ప్రయాణాల్లో చేసిన అల్లరి, కిటికీ పక్కన కూర్చొని చూసిన ప్రకృతి దృశ్యాలు మరోసారి కళ్లముందు కదిలాయని చెప్పారు. ప్రస్తుతం పిల్లలకు అరుదుగా మారుతున్న రైలు ప్రయాణ అనుభూతిని తన కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ ఆస్వాదించడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. ఆటలు, పాటలు, నవ్వులతో సాగిన ఈ ప్రయాణంలో సమయం తెలియకుండానే శ్రీకాళహస్తి చేరుకున్నామని తెలిపారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడానికి రైలు ప్రయాణం ఉత్తమ మార్గమని, ఈ అనుభవం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.