Friday, 10 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఓటర్ల జాబితా సవరణ సర్వే పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఓటర్ల జాబితా సవరణ సర్వే పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి న్యూస్) : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని 11, 13 వార్డుల్లో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, బోగస్ ఓట్లకు తావులేకుండా పారదర్శకంగా జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.