శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి న్యూస్) : ఆర్టీసీ మాజీ ఎన్‌ఎమ్‌యూ వైస్ ప్రెసిడెంట్, తెలుగు భాషా అభివృద్ధి సేవాసమితి అధ్యక్షులు, సీనియర్ కార్మిక నాయకులు పల్లమాల సుధీర్ మరణం తీరని లోటని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. రామచంద్ర సినిమాహాల్ ఎదురుగా ఉన్న సుధీర్ నివాసానికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి, భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల సన్నాహాల్లో పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించి తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

కార్మిక నాయకులు పల్లమాల సుధీర్ మృతికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి