శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పంగూరు గ్రామ హరిజనవాడలో నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సమస్యను గ్రామ ప్రజలు జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఏర్పేడు తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తహసిల్దార్ ఆదేశాల మేరకు ఉప తహసిల్దార్, రెవెన్యూ అధికారులు పంగూరు హరిజనవాడకు చేరుకుని గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా చర్చించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. దీనికి గ్రామస్తులందరూ సానుకూలంగా స్పందిస్తూ విగ్రహ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని అంగీకరించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసులు, న్యాయవాదులు కొప్పల సుబ్రహ్మణ్యం, పుట్టా గణేష్, రెవెన్యూ సిబ్బంది మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.

పంగూరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వివాదం సుఖాంతం