Friday, 10 July 2026
  • Home  
  • ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న ఆలయ చైర్మన్ సాయి కొట్టే
- తిరుపతి

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్న ఆలయ చైర్మన్ సాయి కొట్టే

శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి న్యూస్) : భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి ఐదో వార్డు పరిధిలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ సాయి కొట్టే బూత్ స్థాయి అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క ఓటు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి, వివరాల సవరణకు ఈ సర్వే ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. గణింపు పత్రంలో అడిగిన వివరాలను స్పష్టంగా నింపి, ఒక ప్రతిన బూత్ స్థాయి అధికారులకు సమర్పించి, మరో ప్రతిన రసీదుతో సహా తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వివరించారు. అర్హులైన వారి ఓట్లు నిలిచిపోకుండా లేదా జాబితా నుండి తొలగిపోకుండా బూత్ స్థాయి ఏజెంట్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన వివిధ మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, ఓటర్ల వివరాలను డిజిటల్ రూపంలో అనుసంధానం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.