ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 10 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: గతంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని, అందుకే ప్రజలు వారికి తగిన తీర్పు ఇచ్చారని సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. శుక్రవారం మనుబోలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన జనసేన నేత సురేష్ నాయుడు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 10 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: గతంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని, అందుకే ప్రజలు వారికి తగిన తీర్పు ఇచ్చారని సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. శుక్రవారం మనుబోలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

