Friday, 10 July 2026
  • Home  
  • గిరిజన కాలనీ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ
- తిరుపతి

గిరిజన కాలనీ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలోని ఈశ్వరయ్య గిరిజన కాలనీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పలకలను పంపిణీ చేశారు. తిరుపతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వాంపల్లి జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు శేషు సాయి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, దాతల సేవాభావం అభినందనీయమని కొనియాడారు. వ్యాపారవేత్త చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద పిల్లల విద్యాభివృద్ధికి తమ వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈశ్వరయ్య కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోతురాజు మాట్లాడుతూ విద్యార్థులు బడి మానకుండా క్రమంతప్పకుండా వచ్చేందుకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రగతి స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బడి మానేసే పిల్లల (డ్రాప్ అవుట్స్) నివారణకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాల్య వివాహాల అడ్డుకట్టకు తమ సంస్థ నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రోజా రాణి, శిరీష, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.