Monday, 21 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీఎస్సీపై పోరాటం కొనసాగుతుంది:ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, శాసనమండలిలో సమగ్ర చర్చ జరిగేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాలు, నకిలీ ధ్రువపత్రాలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం చర్చను దాటవేస్తోందని విమర్శించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సైబర్ నేరాలపై అవగాహన:సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ

బుచ్చిరెడ్డిపాలెంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రిన్సిపాల్ ఏ.వి. చిరంజీవి, లోక్‌ అదాలత్ సభ్యుడు ఎం. సుబ్బారెడ్డి, సురేంద్ర వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రెస్ట్ చికిత్సలో మైలురాయి

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్‌లో ఆధునిక ఇమేజ్‌-గైడెడ్ బ్రెస్ట్ ట్యూమర్ మార్కర్ క్లిప్ ప్లేస్‌మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. నెరెల్ల కృష్ణతేజ ఈ ప్రక్రియ చేపట్టారు. కీమోథెరపీ అనంతరం ట్యూమర్ తగ్గినా, కనిపించకుండా పోయినా అసలు స్థానాన్ని క్లిప్ ద్వారా గుర్తించవచ్చన్నారు. శస్త్రచికిత్స ప్రణాళిక, ట్యూమర్ బెడ్ గుర్తింపు, బ్రెస్ట్‌ కన్సర్వింగ్ సర్జరీతోపాటు వైద్య విభాగాల సమన్వయానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా సవరణపై సమీక్ష

నెల్లూరు నగర నియోజకవర్గం – 117 ఈ.ఆర్.ఓ ( ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ) వై.ఓ నందన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఎన్నికల ఏ.ఈ.ఆర్.ఓ లు, సూపర్వైజర్ లు, బి.ఎల్.ఓ లతో ఎస్.ఐ.ఆర్ ఎలెక్టోరల్ రోల్స్ – 2026 అంశంపై మంగళవారం సమీక్షను నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) రెండవ దశ నిర్వహణలో క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణలను అందజేశారు. అనంతరం ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 28 వ తేదీ వరకు నిర్వహించనున్న రెండవ దశ ఓటరు జాబితా రూపకల్పనలో మొదటి జాబితాలో ఓటు నమోదు కాని వారికి నోటీసులు అందజేసి, వారి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన 12 రకాల ధృవీకరణ పత్రాలలో ఏవైనా స్వీకరించి యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ హమీద్, ఈ.డి.టి ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు. పి.ఆర్.ఓ. నెల్లూరు నగరపాలక సంస్థ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 కాదు.. 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

*సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి *ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీలకు న్యాయం చేయాలి *బీసీల కలలకు రెక్కలు తొడగాలి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కాకుండా 43 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కార్యదర్శి, రాష్ట్ర బీసీ నేత ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది బీసీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి బీసీలు ఆ పార్టీ వెంటే నడుస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. అందుకు కృతజ్ఞతగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అనే పరిమితిని దాటి, 43 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని** కోరారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ, ఆ శాతానికి మరో ఒక శాతం కలిపి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సమయంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు కోరుకుంటున్నారని తెలిపారు. బీసీల కలలకు రెక్కలు తొడగడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం”అని సంపత్ రాజు పేర్కొన్నారు. బీసీల ఆశయాలను సాకారం చేస్తే రాష్ట్రంలోని బీసీలంతా చంద్రబాబు నాయకత్వం వైపు ఏకతాటిపై నడిచే అవకాశం ఉంటుందని అన్నారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 43 శాతం రిజర్వేషన్లపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఒట్టూరు సంపత్ రాజు విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రమాదేవికి ఎమ్మెల్సీ పదవి పట్ల నెల్లూరు జిల్లా బీసీల హర్షాతిరేకాలు

రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాకు చెందిన బీసీ నాయకురాలు దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల నెల్లూరు జిల్లా బీసీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి అంగన్‌వాడీ విభాగానికి అధ్యక్షురాలిగా సేవలు అందిస్తూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకురాలిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న సముచిత నిర్ణయం అని నెల్లూరు జిల్లా బీసీ నాయకులు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెద్దల సభగా పిలవబడే శాసనమండలిలో రమాదేవి అడుగుపెట్టి, బీసీల హక్కుల గళాన్ని బలంగా వినిపించాలని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీసీల అభిమానాన్ని చూరగొనాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు నాయకులు తెలిపారు. రమాదేవిని అభినందిస్తూ ప్రకటనలు పంపిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, జాతీయ కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి, జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస యాదవ్, రాష్ట్ర నాయకులు ఒట్టూరు సంపత్ రాజు, జాతీయ మీడియా కార్యదర్శి ఉక్కా వెంకట శేషయ్య, రాష్ట్ర నాయకురాళ్లు పిట్టి భార్గవి, లక్ష్మి, వసంతి, రాష్ట్ర నాయకులు ముత్యం గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

‘నగరం నరకం’ అనే మాటను ‘మన నెల్లూరు – మన గర్వం’గా మార్చగలరా?

నగర సమస్యలు ఒక్క శాఖతో పరిష్కారం కావు. సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం అవసరం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా. అజిత వెజెండ్ల, నగర కమిషనర్ వై.ఓ. నందన్ నేతృత్వంలో 100 రోజుల “మారుద్దాం నెల్లూరును” Mission ప్రారంభించాలి. ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, ఆక్రమణలు, పార్కింగ్, పారిశుధ్యం అనే ఆరు అంశాలకు కొలిచే లక్ష్యాలు నిర్ణయించాలి. ప్రతి 30 రోజులకు పురోగతిని ప్రజల ముందు ఉంచాలి. మూడు శాఖలు ఒకే దిశగా కదిలితే మార్పు కనిపిస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆటోలు–బస్సులకు క్రమం లేకపోతే ట్రాఫిక్‌కు క్రమం ఎలా వస్తుంది?

ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించడం, దించడం వల్ల ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆటోలు, బస్సులకు ప్రత్యేక ఎక్కించుకునే మరియు దించే ప్రదేశాలు గుర్తించాలి. జంక్షన్ మధ్యలో లేదా ప్రధాన రహదారిపై వాహనాలు నిలపకుండా పోలీసు పర్యవేక్షణ పెంచాలి. ఆటో యూనియన్లు, RTC, ట్రాఫిక్ పోలీసులతో సమావేశం నిర్వహించి ప్రతి ప్రాంతానికి క్రమబద్ధమైన స్టాప్‌లు ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల సౌకర్యాన్ని తగ్గించకుండా ట్రాఫిక్ ప్రవాహం సజావుగా ఉండే విధానం అమలు చేయాలి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ఉంది… ప్రయాణానికి పనికొస్తుందా?

గుంతలు, అసమాన రోడ్లు, రోడ్డు తవ్వకాల తర్వాత సరైన పునరుద్ధరణ లేకపోవడం ప్రయాణాన్ని కష్టతరం చేస్తుంది. నగరంలోని ప్రతి ప్రధాన, అంతర్గత రహదారికి రహదారి స్థితిగతుల తనిఖీ నిర్వహించాలి. గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలు, నీరు నిలిచే పాయింట్లను GPS ఆధారంగా నమోదు చేసి ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలి. పైప్‌లైన్ లేదా కేబుల్ పనుల కోసం రోడ్డు తవ్విన సంస్థే నిర్ణీత సమయంలో రోడ్డును పునరుద్ధరించేలా బాధ్యత విధించాలి. నాసిరకం పనులపై కాంట్రాక్టర్లకు జరిమానాలు ఉండాలి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్లపై పార్కింగ్… వాహనాలు వెళ్లేది ఎక్కడ?

ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతుంది. ప్రతి ముఖ్య వాణిజ్య ప్రాంతానికి పార్కింగ్ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదో స్పష్టమైన మార్కింగ్ ఉండాలి. ఖాళీ ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించి Paid Parking Zones ఏర్పాటు చేయాలి. ప్రధాన కూడళ్లకు దగ్గరగా పార్కింగ్‌ను నిషేధించాలి. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై టోయింగ్ విధానం అమలు చేస్తే రోడ్లపై సహజంగానే ఖాళీ పెరుగుతుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.