నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక హోటల్ ట్రేడ్ లైసెన్స్‌ను తనిఖీ చేసి, నగరంలో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. అనంతరం డ్రైన్లలో మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించి, స్థానికులను పారిశుధ్య నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



