Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: MunicipalCorporation

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి| వై.ఓ. నందన్

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక హోటల్ ట్రేడ్ లైసెన్స్‌ను తనిఖీ చేసి, నగరంలో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. అనంతరం డ్రైన్లలో మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించి, స్థానికులను పారిశుధ్య నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వీధి శునకాలపై ప్రత్యేక డ్రైవ్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధి శునకాల నియంత్రణకు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు వావిలేటిపాడు, పొదలకూరు రోడ్డు, రామకోటయ్య నగర్, బోసు బొమ్మ ప్రాంతాల్లో సంచరిస్తున్న 12 శునకాలను పట్టుకుని పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

100% చెత్త సేకరణకు వై.ఓ నందన్ ఆదేశం

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శానిటేషన్ విభాగంతో వారాంతపు సమీక్ష నిర్వహించారు. అన్ని డివిజన్లలో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని బ్లాక్‌స్పాట్లను తొలగించి గ్రీన్‌స్పాట్లుగా మార్చాలని, వ్యాపార సంస్థలను గుర్తించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేసి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్‌ను జప్తు చేసి జరిమానాలు విధించాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, జంక్షన్ల వద్ద చెత్త నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది మస్టర్ సమయానికి హాజరై విధులు నిర్వర్తించేలా అధికారులు పర్యవేక్షించాలని నందన్ అన్నారు. సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, వెటర్నరీ వైద్యుడు మదన్ మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.