రక్షాబంధన్ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కమిషనర్ వై.ఓ. నందన్‌ను కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మేయర్ తన పేషీ సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.




