రక్షాబంధన్ సందర్భంగా మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం 9వ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్‌ను నవాబుపేటలోని నివాసంలో కలిసి రాఖీ కట్టారు. ఆ తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డిని కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.





