*ఇంట్రెస్టింగ్ కదా….జీవితం ఏ మలుపు తిరుగుతుందో, విడిపోయిన బంధాలు కేవలం ఒకే ఒక్క ఘటనతో ఎలా మళ్లీ కలుస్తాయో ఎవరూ చెప్పలేరు. శిఖ, సౌరభ్‌ల విడాకుల కేసు చివరికి ఎలా హ్యాపీగా ముగిసిందో చూడండి…!*
ఢిల్లీకి చెందిన శిఖ సింగ్ , సౌరభ్ వివాహం 2020లో జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకు భార్యా భర్తల మధ్య గొడవతో అతనిపై వరకట్నం కేసు పెట్టింది.
శిఖ తండ్రి ఈ కేసు కోసమే తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని లాయర్ల ఫీజు, కోర్టు ఖర్చుల కోసం ఖర్చు
చేసేశాడు. ఈ ఒత్తిడిలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, కనీసం చికిత్స చేయించుకోవడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఒకవైపు కూతురు కాపురం చెడిపోతోందనే బాధ, మరోవైపు ఖర్చులకు డబ్బు సమకూర్చలేక నానా ఇబ్బంది పడ్డారు
ఆయనకు గుండెపోటు రావడంతో తీవ్రమైన పరిస్థితిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నిజానికి ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడానికి వారి దగ్గర డబ్బు లేదు..తన తండ్రి బతుకుతాడో లేడో నని హాస్పిటల్ లో శిఖా ఏడుస్తూనే ఉంది
శిఖ భర్త సౌరభ్‌కు ఈ విషయం తెలియగానే, ఆయన వెంటనే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తన మామగారిని అక్కడి నుండి తీసుకెళ్లి, గుర్గావ్‌లోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ‘మేదాంత గ్రూప్’ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
ఇప్పుడు శిఖ తండ్రి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.
ఆ తర్వాత ఢిల్లీ కోర్టులో జరిగే తదుపరి విచారణకు శిఖ హాజరుకావాల్సి వచ్చింది. ఆమె కోర్టుకు చేరుకోగానే, విడాకుల కాగితాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చింపేసి, తన భర్తను కౌగిలించుకుని చిన్నపిల్లలా ఏ డ్చేసింది..ఎవరో సెల్ ఫోన్లో తీసిన చిన్న వీడియోక్లిప్ ఇప్పుడు వైరల్ లైంది..కానీ చిన్నచిన్న కారణాలతో విడిపోతున్న జంటలకు ఇప్పుడు ఇదొక ఆదర్శమవుతోంది.
Uploaded Video:

