సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎస్ టి ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సోదరుభావానికి ప్రతీక గా భక్తులకు ట్రస్ట్ సభ్యులు స్వయంగా శీతల పానీయాలు, తాగునీటిని అందించి సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ, శ్రీవారి కల్యాణ మహోత్సవానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని దాహార్తి తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు, భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తులు ట్రస్ట్ సభ్యుల సేవాభావాన్ని అభినందిస్తూ, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిన్న గురువులయ హైదర్ సాహెబ్ ,మాజీ ఉపసర్పంచ్ ఇబ్బు, బీసీ నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్, ఆది, ఖాదర్ బి, మొహబ్బషా తదిరులు పాల్గొన్నారు.



