Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

అనపర్తిలో టీడీపీ అగ్రనేతల ఆత్మీయ కలయిక.. రాజకీయ ఐక్యతకు వేదిక!

అనపర్తి, సెప్టెంబరు 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, APSSDC చైర్మన్ బురుగుపూడి శేషారావు తదితరులు హాజరయ్యారు. అతిథులను మనోజ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. బొడ్డు వెంకటరమణ చౌదరి వారికి పెద్దాడ సేంద్రియ రైస్ అందజేశారు.

తూర్పు గోదావరి

సెప్టెంబర్ 16న అనపర్తిలో జాబ్ మేళా

కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మాధవి కాలేజీలో సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించనున్న **“జాబ్ మేళా”**కు సంబంధించిన కరపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

SIR ఫేజ్‌–2పై కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరం గ్రామంలో SIR ఫేజ్‌–2 చివరి దశకు చేరుకున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SIR ఫేజ్‌–2 ప్రక్రియలో చేపట్టాల్సిన తదుపరి చర్యలు, పెండింగ్‌ అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై నాయకులతో చర్చించారు. ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

తూర్పు గోదావరి

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరంలో శ్రీ సాయితేజా విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 2,000 మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రజలకు వరంలా సీఎం రిలీఫ్ ఫండ్

56 మంది లబ్ధిదారులకు రూ.46 లక్షల చెక్కులు పంపిణీ అనపర్తి, సెప్టెంబరు10 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద, ఆపన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో గురువారం నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం రూ.46 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలోకి రాని పేషెంట్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఖర్చులను భరించలేని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు 524 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.4.68 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా గత రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులకు అందుతున్న సహాయం సక్రమంగా వినియోగపడేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య చికిత్సకు సంబంధించిన అంచనా వ్యయాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, అర్హులైన వారికి అవసరమైన మేరకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అనేక కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఎంతో ఊరటనిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

నిజం గెలిచిందంటూ కూటమి శ్రేణుల నినాదాలు అనపర్తి, సెప్టెంబరు 9 (పున్నమి ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనపర్తిలో కూటమి శ్రేణులు ‘నిజం గెలిచింది’ పేరుతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 2023 సెప్టెంబరు 9 రాష్ట్ర రాజకీయాల్లో చీకటి రోజుగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి సుమారు 53 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఆయనకు సంఘీభావంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారని తెలిపారు. అనంతరం ప్రజలు చంద్రబాబుకు అద్భుతమైన మద్దతు, రాజకీయ మాండేట్ ఇచ్చారని అన్నారు. కేసులో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తూ చంద్రబాబు బయటకు వచ్చారని, ఈ నేపథ్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనోజ్ రెడ్డి తెలిపారు.

తూర్పు గోదావరి

అనపర్తి నుంచి రాజమహేంద్రవరం వరకు కాషాయ కదనోత్సాహం.. 100 జెండాలతో బీజేపీ శక్తి ప్రదర్శన

రాజమహేంద్రవరంలో బీజేపీ జెండాల పండుగ రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 (పున్నమి ప్రతినిధి): బీజేపీ చేపట్టిన “మన ఊరు–మన జెండా” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో “100 జెండాల పండుగ” ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ పార్టీ శ్రేణులు కార్ల ర్యాలీగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. అనంతరం 36, 39వ వార్డుల్లో బీజేపీ జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నటరాజ్ థియేటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే “మన ఊరు–మన జెండా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

50 వేల మంది తెలుగు రైతులకు ఊరట.. పురందేశ్వరి–నల్లమిల్లి చొరవకు రైతుల జేజేలు

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో తెలుగు రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు చొరవ చూపిన ఎంపీ పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నల్లమిల్లిని ఆశ్రయించగా, ఆయన పురందేశ్వరి ద్వారా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడించి కొనుగోలుకు చర్యలు చేపట్టేలా కృషి చేశారు. దీంతో సుమారు 50 వేల మంది తెలుగు రైతులకు ఊరట లభించింది. ఈ సందర్భంగా రైతులు పురందేశ్వరి, నల్లమిల్లిని కలిసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

తూర్పుగోదావరి టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల ఆత్మీయ విందు

విజయవాడ, సెప్టెంబరు 7 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో మంత్రి నిమ్మల చర్చించారు.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో ‘ఎస్’ టీవీ సందడి.. బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలో “ఎస్” టీవీ (సుమన్ టీవీ) రాజమహేంద్రవరం బ్రాంచ్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నల్లమిల్లి, సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలను అందిస్తూ విశ్వసనీయమైన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సుమన్ టీవీ రాజమహేంద్రవరం బ్రాంచ్ మరింత అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ పాల్గొన్నారు. ఆళ్ళ గోవింద్ కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.