Wednesday, 16 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు ముందుకు సాగాలి: నల్లమిల్లి

అనపర్తి, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని అనపర్తిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను ఇంజనీర్లు సత్కరించారు. యువ ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య జీవితం, సేవలు స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఇంజనీర్స్ డే వేడుకలను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ భావి ఇంజనీర్లలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

బిక్కవోలులో ఘనంగా వినాయక చవితి నవ రాత్రుల మహోత్సవాలు

బిక్కవోలు, సెప్టెంబరు 14 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితిని పురస్కరించుకుని నవ రాత్రుల మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో కలశ స్థాపన కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతులు కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణం నెలకొంది.

తూర్పు గోదావరి

స్థానిక పోరుకు కూటమి సన్నద్ధం.. సమన్వయమే విజయ మంత్రం

టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: జిల్లా స్థాయి సమావేశంలో నిర్ణయం రాజమహేంద్రవరం, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల అబ్జర్వర్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. టీడీపీ తరఫున ఎన్నికల అబ్జర్వర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ తరఫున ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర, జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, ఆత్మ చైర్మన్ రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై స్పష్టత వచ్చే వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నాయకులు సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయిలోనూ నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. కూటమి ఐక్యతే బలం.. సమన్వయమే విజయానికి మార్గం అనే లక్ష్యంతో స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు

రూ.1.25 కోట్లతో ఐపిహెచ్ఎల్ ల్యాబ్ ఏర్పాటు: ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో **రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ (ఐపిహెచ్ఎల్)**ను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్‌గా ల్యాబ్‌ను ప్రారంభించగా, అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, ఆర్డీవో శివరాముడు, డీఎంహెచ్‌వో కోమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐపిహెచ్ఎల్‌లో సుమారు 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే అవకాశం ఉందన్నారు. రక్త పరీక్షలకు సంబంధించి అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ ల్యాబ్‌తో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షల ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఈ ల్యాబ్‌కు అనుసంధానం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కేంద్రాల నుంచి సేకరించిన నమూనాలను అనపర్తి ల్యాబ్‌కు తరలించి పరీక్షలు నిర్వహించి, సంబంధిత కేంద్రాలకు నివేదికలు పంపించే విధానం ఉంటుందని వివరించారు. జిల్లాకు ఈ ఐపిహెచ్ఎల్ ల్యాబ్ ఒక ముఖ్యమైన వైద్య వసతిగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశామని, నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి భవన సముదాయం త్వరలో అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఐపిహెచ్ఎల్ ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ, డీసీహెచ్ఎస్, డీఎంఅండ్‌హెచ్‌వో, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రామగుర్రెడ్డి, వైద్యులు, వైద్యేతర సిబ్బంది, ల్యాబ్ సమన్వయకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండలం, టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

అనపర్తి, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిస్తూ అనపర్తిలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కుంచెం సత్యనారాయణ (ప్యాచీల షాపు శెట్టి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి అండ

రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ST రాజాపురం గ్రామానికి చెందిన శ్రీమతి కురుమెల లక్ష్మీ నాగ శివ పార్వతికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.25,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. వైద్య ఖర్చుల భారాన్ని కొంత మేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యంలో 50 వేల మట్టి గణపతుల పంపిణీ

రామవరం, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్వాతి ప్రమోటర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఆధ్వర్యంలో 50 వేల మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రామవరంలో చిన్నారులు, గ్రామస్థులకు మట్టి గణపతి విగ్రహాలను అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సంప్రదాయంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో SPIL సభ్యులు, కూటమి నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

LVR క్లబ్‌లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆత్మీయ స్వాగతం

గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరు పర్యటనకు విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని LVR క్లబ్‌లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షులు నూకవరపు వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుబ్బారావు, క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లితో వారు ఆత్మీయంగా మాట్లాడి, పలు అంశాలపై చర్చించారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికల వ్యూహంపై బీజేపీ కీలక భేటీ.. పాల్గొన్న నల్లమిల్లి

గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరులో నిర్వహించిన బీజేపీ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నాహకాలపై నేతలు చర్చించారు.

తూర్పు గోదావరి

బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహంపై కీలక చర్చలు

గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరులో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మంది పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల నిర్వహణ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.