రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పురందేశ్వరి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు ఆమె అందిస్తున్న సేవలు మరింత విస్తరించాలని, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.


