Thursday, 27 August 2026
  • Home  
  • వైష్ణవి గార్డెన్ లో “మీకోసం మీ పోలీస్” — డోర్ టు డోర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం
- ఆంధ్రప్రదేశ్

వైష్ణవి గార్డెన్ లో “మీకోసం మీ పోలీస్” — డోర్ టు డోర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, డీసీపీ క్రైమ్స్ లతా మాధురి , ఏసీపీ , ఏసీపీ వెంకట్రావు తదితర ఉన్నతాధికారుల సూచనల మేరకు “మీకోసం మీ పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వైష్ణవి గార్డెన్ లో… డోర్ టు డోర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని, కరపత్రాలు పంపిణీ చేస్తూ “దొంగలు ఉంటారు జాగ్రత్త – పోలీస్ అలర్ట్” అనే నినాదంతో ప్రజలకు నేర నివారణపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా సంచరించే పార్కులు, వాకింగ్ ప్రాంతాలు తదితర ప్రదేశాల్లో వాకింగ్ చేసే మహిళలు, వృద్ధులు మరియు ఇతర ప్రజలను కలిసి చైన్ స్నాచింగ్, బ్యాగ్ చోరీలు, ఇంటి దొంగతనాలు, సెల్‌ఫోన్ మరియు వాహనాల చోరీలు వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మహిళలు వాకింగ్‌కు వెళ్లే సమయంలో విలువైన బంగారు ఆభరణాలను ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాగులను భద్రంగా ఉంచుకోవాలని, ఇంటిని విడిచి బయటకు వెళ్లే సమయంలో తలుపులు, కిటికీలు సక్రమంగా లాక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినప్పుడు వారి వివరాలను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలియజేశారు.అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయడంతో పాటు, దువ్వాడ, గాజువాక, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం నిరంతరం అందుబాటులో ఉండే ఇన్‌స్పెక్టర్ శ్రీ జీ.డి. బాబు – సెల్: 9490617922 నంబర్‌కు సమాచారం అందించిన వెంటనే స్పందించి అవసరమైన పోలీస్ సహాయం అందిస్తామని తెలియజేశారు.“ప్రజల భద్రతే మా బాధ్యత – నేర నివారణలో ప్రజల సహకారమే మా బలం” అనే సందేశంతో పోలీసులు ప్రజలతో మమేకమై ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.పోలీసులు ఇంటింటికీ వచ్చి మహిళలు, వృద్ధులు మరియు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి భద్రత గురించి సూచనలు ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు, మహిళలు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసి పోలీస్ శాఖ పట్ల తమ అభిమానం మరియు నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, “మీ భద్రత కోసం – మీ పోలీస్ ఎల్లప్పుడూ మీతోనే” అనే భరోసాను విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ శాఖ ప్రజలకు తెలియజేసింది. ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.