బీసీలను ప్రోత్సహించిన ఘనత టీడీపీదే
బీసీలంతా ఐక్యంగా ఉండాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి మండపేట, సెప్టెంబరు 27 (పున్నమి ప్రతినిధి): బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీలంతా ఐకమత్యంగా ఉండి తమ హక్కులు, అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. మండపేట నియోజకవర్గం ఏడిదలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో జాతీయ బీసీ సంఘం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆర్. కృష్ణయ్యతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బీసీ సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.

