Sunday, 27 September 2026
  • Home  
  • ముంపు బాధితులకు ఎమ్మెల్యే నల్లమిల్లి భరోసా
- తూర్పు గోదావరి

ముంపు బాధితులకు ఎమ్మెల్యే నల్లమిల్లి భరోసా

పెదపూడి, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): భారీ వర్షాలతో పెదపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పడిన ముంపు పరిస్థితులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గొల్లల మామిడాడ, పెదపూడి, దోమాడ, ఏపీ త్రయం, రామేశ్వరం తదితర గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఏపీ త్రయం, రామేశ్వరం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీట మునిగిన ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. బాధిత రైతులు, ప్రజలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.