Monday, 28 September 2026

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

అనపర్తిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అనపర్తి, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఏరియా ఆసుపత్రి, తిలక్ రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపం, వెంకటరత్నపురంలో నిర్వహించిన వేడుకల్లో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో లక్ష్మీనరసపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో అధిక పని దినాలు కల్పించడంలో విశేష కృషి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గణేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

కేశవరం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి సహాయ కార్యదర్శిగా సేవలందిస్తూ, పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పెదపాటి సూర్య గణేష్‌కు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పెదపాటి విష్ణు మాట్లాడుతూ.. సూర్య గణేష్ తనకు ఆత్మీయ తమ్ముడని, సేవా కార్యక్రమాల్లో తనతో కలిసి ముందుకు సాగుతూ సమాజ సేవ పట్ల నిబద్ధతను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. గణేష్ జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత మరింత పెరిగి, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలకు మార్గదర్శిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత, పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు కూడా పెదపాటి సూర్య గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి తనవంతు సేవ అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్‌కు పలువురు సేవా సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

తూర్పు గోదావరి

చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

బిక్కవోలు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి దంపతుల కుమారుడు చిరంజీవి చోడవరపు రాజా జ్ఞాపకార్థం మల్లంపూడిలోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ద్వారా ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో చిరస్మరణీయంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రాంబాబు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పిఎస్వీ), పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభం

పెడపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్లినిక్ భవనాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీగా తిరంగా ర్యాలీ

అనపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గర్ల్స్ హైస్కూల్ నుంచి పంచాయతీ కార్యాలయం మీదుగా రైల్వేస్టేషన్, దేవీచౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో ర్యాలీ సాగడంతో అనపర్తి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జెండా విశిష్టత, ఔన్నత్యాన్ని చాటిచెప్పడంతో పాటు ప్రతి పౌరుడిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రతి పౌరుడు కాపాడేలా అవగాహన కల్పించడమే తిరంగా యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు అనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఐఏఎస్‌తో కలిసి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని కొంతమూరు, కాతేరు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర్ నగర్, షటిల్ బస్ స్టాప్‌లు, బస్సుల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, అత్యవసర సేవలు, పోలీసు సిబ్బంది వసతి తదితర అంశాలపై అధికారులు చర్చించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రవాణా, భద్రతా ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.

తూర్పు గోదావరి

సింగంపల్లిలో రూ.2.20 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

రంగంపేట, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం సింగంపల్లిలో రూ.2.20 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్యరంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 65 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో సామాన్యులు ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని తెలిపారు. అనపర్తి వంద పడకల ఆసుపత్రి, పెదపూడి సీహెచ్‌సీతో పాటు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలను బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద రోగులకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌లను కూడా బలోపేతం చేసి అధునాతన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల రంగాల్లో సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, రంగంపేట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సింగంపల్లి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.