Friday, 4 September 2026
  • Home  
  • చిరు సేవా సమితి సేవా కార్యక్రమాలు అభినందనీయం
- తూర్పు గోదావరి

చిరు సేవా సమితి సేవా కార్యక్రమాలు అభినందనీయం

బుర్రిలంక, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): చిరు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాలను డాక్టర్ పెదపాటి విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడంతో పాటు, ఉచిత వైద్య సేవల ద్వారా ప్రజల ఆరోగ్యానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన చిరు సేవా సమితి నిర్వాహకులతో పాటు రమాదేవి హాస్పిటల్ యజమాని డాక్టర్ రమాదేవి, వైద్య సిబ్బంది, రక్తదాతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, సేవా మార్గంలో చిరు సేవా సమితి మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

బుర్రిలంక, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): చిరు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాలను డాక్టర్ పెదపాటి విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడంతో పాటు, ఉచిత వైద్య సేవల ద్వారా ప్రజల ఆరోగ్యానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన చిరు సేవా సమితి నిర్వాహకులతో పాటు రమాదేవి హాస్పిటల్ యజమాని డాక్టర్ రమాదేవి, వైద్య సిబ్బంది, రక్తదాతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, సేవా మార్గంలో చిరు సేవా సమితి మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.