శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో పద్మశాలిపేటలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ మిద్దెల హరి తండ్రి మిద్దెల కృష్ణయ్య ఆకస్మిక మరణం పట్ల శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కృష్ణయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో అంజూరు తారక శ్రీనివాసులు, పగడాల రాజు, ఆర్.డి.ఓ. ముత్తు, శ్రీవారి సురేష్, కంటా ఉదయ్ కుమార్, పఠాన్ ఫరీద్, గోరా, వేలూరు రమేష్, ఆర్కాట్ శంకర్, అస్లాం, ఆరిఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మిద్దెల కృష్ణయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంతాపం