శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి శుక్రవారం నిర్వహించే వారపు సంతను బొజ్జల బృందమ్మ సందర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడుతో కలిసి ఆమె సంత అంతటా కలియదిరుగుతూ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలాది మంది ప్రజలు, వినియోగదారులు ఈ సంతకు వస్తుంటారని, వారి ఆరోగ్య దృష్ట్యా మార్కెట్ పరిసరాలను అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేయాలని వ్యాపారులకు సూచించారు. సంతకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులకు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయదారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. సంతలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

వారపు సంతలో బొజ్జల బృందమ్మ సందడి – స్వచ్ఛత పాటించాలని విజ్ఞప్తి