శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) వేలంపాడు జడ్‌పీ హైస్కూల్‌లో 9వ బెటాలియన్ SDRF సిబ్బంది పాఠశాల భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 9వ బెటాలియన్ కమాండెంట్ ఈ.ఎస్. సాయి ప్రసాద్ మార్గదర్శకత్వంలో, అసిస్టెంట్ కమాండెంట్ బి. ఆనంద్ కన్నా పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎంఆర్‌ఓ సుబ్బారావు, వేలంపాడు వీఆర్‌ఓ సుబ్బరాజు హాజరయ్యారు. సమన్వయ బాధ్యతలను SDRF ఆర్‌ఐ డి. వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రాయోగికంగా వివరించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా రక్షణ చర్యలు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), సురక్షితంగా బయటకు వెళ్లే విధానం (ఎవాక్యువేషన్)పై సిబ్బంది ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనగా, ప్రధానోపాధ్యాయురాలు రేణుకతో పాటు ఉపాధ్యాయులు SDRF బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అప్రమత్తత, భద్రతపై అవగాహన మరింత పెరిగిందని పేర్కొన్నారు.

వేలంపాడు జడ్‌పీ హైస్కూల్‌లో SDRF మాక్ డ్రిల్ – విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపు