శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని స్థానిక శుక బ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలోని భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రిలో శుక్రవారం నేత్ర రోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 22 మంది రోగులకు విజయవంతంగా కాటరాక్ట్ (కంటి శుక్లాల) శస్త్రచికిత్సలు పూర్తి చేసి, వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, ప్రముఖ దంత వైద్యులు లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో శుక బ్రహ్మాశ్రమం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ అతిథుల చేతుల మీదుగా ఉచిత మందుల కిట్‌లను అందజేశారు. ఆసుపత్రి కోఆర్డినేటర్ వి. దొరస్వామి నేతృత్వంలో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆశ్రమ సేవా దృక్పథం పట్ల రోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

శుక బ్రహ్మాశ్రమంలో 22 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, మందుల పంపిణీ