Friday, 17 April 2026
  • Home  
  • అగ్నిప్రమాదంలో మృతి – బాధితులకు రిషితా రెడ్డి చొరవతో తక్షణ సాయం
- తిరుపతి

అగ్నిప్రమాదంలో మృతి – బాధితులకు రిషితా రెడ్డి చొరవతో తక్షణ సాయం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని వెదుళ్ళ చెరువు గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన బండి వెంకటసుబ్బయ్య అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఆయన భార్య బండి రాణెమ్మ తెలుగుదేశం పార్టీ సభ్యురాలు కావడంతో, పార్టీ తరఫున అమలులో ఉన్న ప్రమాద బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది. ఈ సహాయాన్ని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆమె ప్రత్యేక కృషితో ఈ ఆర్థిక సహాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి, మేకల రమేష్, వెంకటాద్రి యాదవ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.