Friday, 17 April 2026
  • Home  
  • మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.
- ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

​గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ స్థానిక గన్నవరం బాయ్స్ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో మహిళా భద్రత, రక్షణ చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం సి.ఐ. మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వేధింపులను అరికట్టడంలో చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘దిశ’ యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి విద్యార్థిని మొబైల్‌లో ఈ యాప్ ఉండాలని, ఆపద సమయంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. ​వేధింపులకు గురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని, విద్యార్థులు తమ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

​గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్

స్థానిక గన్నవరం బాయ్స్ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో మహిళా భద్రత, రక్షణ చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం సి.ఐ. మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వేధింపులను అరికట్టడంలో చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘దిశ’ యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి విద్యార్థిని మొబైల్‌లో ఈ యాప్ ఉండాలని, ఆపద సమయంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.

​వేధింపులకు గురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని, విద్యార్థులు తమ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.