కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
సిద్ధరామయ్య రాజీనామాతో గత కొంతకాలంగా కొనసాగుతున్న నాయకత్వ మార్పు ఊహాగానాలకు తెరపడింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపిన అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతానని, సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ పరిణామం కర్ణాటక కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపనుంది.


